అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది భారత ముఖ్య ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్‌లు సుఖ్‌బీర్ సింగ్ సంధూ, జ్ఞానేశ్ కుమార్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. షెడ్యూల్ వెల్లడితో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.సాధారణ ఎన్నికలతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీలకు, కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. కాగా, ఈ సాధారణ ఎన్నికల్లో మొత్తం 97 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ చెప్పారు. అందులో కోటీ 82 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 12 లక్షల పోలింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 55 లక్షల ఈవీఎంలను సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
ఎన్నికల విధుల్లో మొత్తం 1.5 కోట్ల మంది ఉద్యోగులు పాలుపంచుకోనున్నారని చెప్పారు.లోక్‌సభకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 19న నిర్వహించనున్నారు. రెండో దశ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 26న, మూడో దశ ఎన్నిలక పోలింగ్ మే 7న, నాలుగో దశ ఎన్నికల పోలింగ్ మే 13న, ఐదో దశ ఎన్నికల పోలింగ్ మే 20న, ఆరో దశ ఎన్నికల పోలింగ్ మే 25న, ఏడో దశ ఎన్నికల పోలింగ్ జూన్ 1న జరుగనున్నాయి. జూన్ 4న లోక్‌సభ ఎన్నికలతోపాటే వివిధ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు.ప్రతి ఎన్నికల్లో డబ్బు ప్రభావం పెరుగుతోందని.. ఎన్నికల్లో డబ్బు ప్రభావాన్ని వందశాతం అడ్డుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికల జరగనున్న నేపథ్యంలో డిజిటల్ పేమెంట్స్ పై, బ్యాంకు లావాదేవీలపై కూడా నిఘా ఉంచుతామని..టివి, సోషల్ మీడియా ప్రచారంపై నిరంతరం నిఘా ఉంటుందని చెప్పింది. “
దేశంలో మొత్తం 10.5లక్షల పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 85 ఏళ్లు దాటిన వారు ఇంటి నుంచే ఓటు వినియోగించుకోవచ్చు. 12 రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ ఉన్నారు. దేశంలో మొత్తం ఓటర్లలో పురుష ఓటర్లు 49.7 కోట్లు, మహిళా ఓటర్లు 47.1కోట్లు ఉన్నారు. 48వేలమంది ట్రాన్స్ జెండర్లు, 88.4లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల పూర్తి వివరాలను కేవైసి యాప్ లో చూసుకోవచ్చు. 1.85కోట్ల మంది యువతి తొలిసారి ఓటు వేయనున్నారు” అని వెల్లడించారు.
దేశంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల వైపు ప్రపంచమంతా చూస్తోందని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. 2024లో ప్రపంచవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయని… భారత ప్రజస్వామ్యబద్ధమైన ఎన్నికలను ప్రపంచం గమనిస్తుందన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్యామైన భారత్ లో ఎన్నికలకు సౌకర్యాలు కల్పించడం పెద్ద సవాల్ వంటిదన్నారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్క ఓటరు పాల్గొనాలని ఆయన కోరారు.
ఎన్నికలకు 55 లక్షల ఇవిఎంలను సిద్ధం చేశామని చెప్పారు. కాశ్మీర్ కు కూడా నిర్వహించాల్సి ఉందన్నారు. ఈసారి దేశంలో మొత్తం 97కోట్లమంది ఓటర్లు ఉన్నారని.. ఎన్నికల ప్రక్రియలో కోటి 50 లక్షల మంది సిబ్బంది పాల్గొంటారని తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియపై సమీక్షించామన్నారు. ఎలాంటి పొరబాట్లు లేకుండా ఎన్నికలు నిర్వహించాలనేదే మా లక్ష్యమని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో ఈసారి ఎన్నికలు జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు.