bjp-congress
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

బీజేపీ కాంగ్రెస్ మధ్య వాట్సప్ వార్

ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం వల్ల అన్ని పార్టీలూ సోషల్ మీడియాని ప్రచారానికి బాగానే వాడుకుంటన్నాయి. ఈ విషయంలో ముందు నుంచీ యాక్టివ్‌గా ఉంటోంది బీజేపీ. అయితే…ఇప్పుడు ఆ పార్టీ చేస్తున్న ఓ పని వివాదాస్పదమవుతోంది. వికసిత భారత్ సంపర్క్ పేరిట వాట్సాప్‌లో చాలా మందికి ఓ మెసేజ్‌ పంపుతోంది బీజేపీ సోషల్ మీడియా వింగ్. మోదీ సర్కార్ పని తీరు ఎలా ఉందో ఫీడ్‌బ్యాక్‌తో పాటు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వాలని అడుగుతోంది. అయితే ప్రభుత్వ డేటాబేస్‌ని మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని, మెసేజింగ్ యాప్‌ని రాజకీయ ప్రచారాల కోసం వాడుకోవడం ఏంటని ప్రశ్నిస్తోంది. కేరళ కాంగ్రెస్‌ దీనిపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలు చేస్తోంది. మెటా అకౌంట్‌ని ట్యాగ్ చేసి ప్రశ్నలు సంధిస్తోంది. ఉన్న వాట్సాప్ వెరిఫైడ్ అకౌంట్ నుంచి ఆటోమేటెడ్‌ మెసేజ్‌లు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

పౌరుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ కోరుతున్న పార్టీ అందులో PDFని పంపడంపై మండి పడింది. ఇదంతా కేవలం ప్రచారమే అని తేల్చిచెబుతోంది. ఫీడ్‌బ్యాక్‌ పేరుతో బీజేపీ ఇలా ప్రభుత్వ డేటాని దుర్వినియోగం చేస్తున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఇలా వాట్సాప్‌లో అందరికీ మెసేజ్‌లు పంపుతున్నారు. మోదీ సర్కార్ తమ రాజకీయ ప్రచారం కోసం వాట్సాప్‌ని వాడుకుంటోంది”
– కేరళ కాంగ్రెస్
అంతటితో ఆగకుండా కేరళ కాంగ్రెస్ ఆ మెసేజ్‌ల స్క్రీన్‌షాట్స్‌నీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. బిజినెస్ ప్లాట్‌ఫామ్‌ని ఇలా ప్రచారం కోసం వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. వాట్సాప్ పేరెంట్ కంపెనీ మెటా రాజకీయ పార్టీలు, నేతలు ఇలా ప్రచారం కోసం వినియోగించుకోవడంపై ఆంక్షలు విధించాలని డిమాండ్ చేసింది. బీజేపీ కోసం స్పెషల్ పాలసీ ఏమైనా ఫాలో అవుతున్నారా అంటూ మెటాపై మండి పడింది. బీజేపీ ప్రభుత్వం ఓ అజెండాని ప్రిపేర్ చేసి వాట్సాప్‌ ద్వారా అందరికీ పంపుతోందని స్పష్టం చేసింది. అయితే..బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫిబ్రవరిలోనే వీడియో వ్యాన్‌లను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఈ వ్యాన్‌లు తిరుగుతూ మోదీ సర్కార్‌పై ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాయి. ఆ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా బీజేపీ మేనిఫెస్టోని సిద్ధం చేయనుంది. లోక్‌సభ ఎన్నికల అభ్యర్థులను ఎంపిక చేయడంలోనూ ఇదే వ్యూహాన్ని అనుసరించింది బీజేపీ. స్థానికుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని ఆ తరవాత కొంత మంది సిట్టింగ్ ఎంపీలను పక్కన పెట్టి కొత్త వారికి అవకాశమిచ్చింది.