MODI-PM
తెలంగాణ రాజకీయం

తెలంగాణ భూభాగాన్ని ఆంధ్రకు దారాదత్తం చేసిన నరేంద్ర మోడీ సర్కార్

తెలంగాణ రాష్ట్రంలోని ఏడు మండలను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రావడంతోనే ఆంధ్రప్రదేశ్ కు ధారాధాత్తం చేసిందని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు ఆరోపించారు.. మంగళవారం పట్టణంలోని జువ్వాడి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ యూపీఏ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారని ఆ తర్వాత కేంద్రంలో అధికారం లోకి వచ్చిన నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం మన రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏడు మండలాలను గుట్టుచప్పుడు కాకుండా ఆంధ్ర ప్రాంతంలో కలిపి వేసిందని తీవ్రంగా దుయ్యబట్టారు.. విభజన సమయంలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ ,కోచ్ ఫ్యాక్టరీ, ఐటిఐ ఆర్ లాంటి ఎన్నో విభజన హామీలు పొందుపరిచిందని ఆ తర్వాత మోడీ ఆ హామీలను తుంగలో తొక్కాడని అన్నారు.. ఆనాడు అత్యున్నత చట్టసభైన పార్లమెంటు సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేంద్రంలోని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తల్లిని చంపి బిడ్డను వేరు చేసిందని తెలంగాణ ఏర్పాటుపై తన అక్కసు ను వెళ్లగక్కాడని అన్నారు.

కేంద్రంలో 2014లో అధికరానికి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ రోజు వరకు తెలంగాణ ప్రాంతానికి ఏమి చేసిందో చెప్పాలని జువ్వాడి కృష్ణారావు సూటిగా ప్రశ్నించారు….బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తుందని పేదవాడి రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తుందన్నారు.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలను సాధిస్తుందని నిజామాబాద్ లోక్ సభ పరిధిలోని కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ వస్తుందని పార్టీ నాయకులు కార్యకర్తలు సైనిక స్ఫూర్తితో శ్రమించాలని జువ్వాడి కృష్ణారావు ఈ సందర్భంగా పిలుపు నిచ్చారు..