తెలంగాణ

సిరిసిల్లలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కూలీల మృతి

జిల్లాలోని రుద్రంగి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం కూలిపనికి వెళ్తున్న వారిని గుర్తు తెలియని వాహనం వెనకనుంచి ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతిచెందినవారిని మహారాష్ట్రకు చెందిన సందీప్‌ (18), వెంకట్‌ పవార్‌ (15)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.