pita-pawan
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

పిఠాపురంలో పవన్ కళ్యాణ్

జనసేనాని పవన్ కల్యాణ్  శనివారం నుంచి  ఎన్నికల ప్రచారం చేపట్టారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం అసెంబ్లీ  నియోజకవర్గం నుంచే ప్రచార పర్వానికి  శ్రీకారం చుట్టారు. పవన్ ఎన్నికల ప్రచార యాత్రకు వారాహి విజయభేరి అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. వారాహి వాహనం ద్వారా పవన్ ఎన్నికల ప్రచార పర్యటనలు సాగించనున్నారు.ఈ క్రమంలో, పవన్ కొద్దిసేపటి కిందట పిఠాపురం చేరుకున్నారు. ఆయనకు హెలిప్యాడ్ వద్ద జనసేన పార్టీ  శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అనంతరం పవన్ దొంతుమూరు గ్రామానికి వెళ్లారు. పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ నివాసానికి వెళ్లి ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు.

తాజా రాజకీయ పరిస్థితులు, నియోజకవర్గ అంశాలపై ఇరువురు చర్చించుకోనున్నారు.కాగా, పవన్ ఈ సాయంత్రం 4 గంటలకు చేబ్రోలు రామాలయం సెంటర్ వద్ద తొలి బహిరంగ సభలో పాల్గొంటారు.