నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఇంటా సంక్షేమ పథకాలను అందించడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా శనివారం రోజున పత్తికొండ నుంచి బయలుదేరి మొదటగా రాతన గ్రామంలో వైసీపీ నాయకులు మోహన్ రెడ్డి, ఉమన్న లు క్రేన్ ద్వారా గజ మాలను వేసి స్వాగతం పలికారు. అనంతరం తుగ్గలికి విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కు వైసీపీ సీనియర్ నాయకులు శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి,మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి లు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం తుగ్గలి లోని మాజీ ఎమ్మెల్యే తమ్మారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి కరోనా సమయంలో మరణించిన వైసీపీ సీనియర్ నాయకులు తుగ్గలి ప్రతాపరెడ్డి, ప్రహల్లాద రెడ్డి చిత్ర పటాలకు పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. అనంతరం గుత్తి ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన మేమంతా సిద్ధం కార్యక్రమానికి హాజరై మండల పరిధిలోని గల ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తుగ్గలి మండలానికి సంక్షేమ పథకాల ద్వారా ఖర్చుపెట్టిన వివరాలను ప్రజలకు తెలియజేశారు.దేశంలో వృద్ధాప్య వితంతు పింఛన్లు 3000 అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే అని ఆయన తెలియజేశారు. దేశంలో ఏ రాష్ట్రం పింఛన్లను ఈ తరహాలో ఇవ్వడం లేదని ఆయన తెలియజేశారు. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గ్రామ సచివాలయ వ్యవస్థ మరియు గ్రామ వాలంటీర్ల వ్యవస్థలను ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను నేరుగా ఇంటికి అందించిన ఘనత మన ప్రభుత్వానికి చెందుతుందని ఆయన తెలియజేశారు. తుగ్గలి మండల వ్యాప్తంగా 36 కోట్లు ఖర్చు చేసి చెరువులకు నీరు అందించే కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన తెలియజేశారు.రాష్ట్రంలో ఎక్కడ అవినీతికి తావు లేకుండా,లంచాల మాట విన పడకుండా పరిపాలన అందిస్తున్నామని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి కొరకు ఎన్నో కోట్ల రూపాయలను ఖర్చు చేసి మౌలిక వసతులను ఏర్పాటు చేశామని ఆయన తెలియజేశారు. గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని మీ అందరి సహకారంతో ఏర్పాటు చేశామని ఆయన తెలియ జేశారు.
ఎటువంటి కులవివక్షత లేకుండా పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించామని ఆయన తెలియజేశారు.మరో మారు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని ఆయన తెలియజేశారు.పత్తికొండ శాసనసభ్యురాలుగా కంగాటి శ్రీదేవిను, పార్లమెంట్ అభ్యర్థిగా బివై రామయ్య ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకొవాలని ఆయన ప్రజలకు తెలియజేశారు.అనంతరం మండల వ్యాప్తంగా ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు ముఖ్యమంత్రి తెలియ జేశారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని గల పలువురు ప్రజలు మాట్లాడుతూ తుగ్గలి మండలాన్ని కరువు మండలం గా ప్రకటించి రైతులు ఆదుకోవాలని,రైతులకు రుణమాఫీను అమలు చేయాలని,గ్రామాలలో నీటి సమస్యలను పరిష్కరించాలని,ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారని, ప్రభుత్వం అందించే ఆసరా,చేయూత పథకాల ద్వారా ఆర్థికంగా భరోసా కల్పించారని,అమ్మఒడి ద్వారా పిల్లల భవిష్యత్తుకు భరోసా కలిగిందని ప్రజలు ముఖ్యమంత్రికి వివరించారు.
ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే సూచనల పెట్టెలో పేపర్ ద్వారా తెలియజేయాలని ముఖ్యమంత్రి ప్రజలకు వివరించారు. అనంతరం జొన్నగిరి మీదుగా గుత్తికి బస్సు యాత్ర బయలుదేరింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి,ఎస్ వి మోహన్ రెడ్డి, చిప్పగిరి వైసీపీ అభ్యర్థి విరుపాక్షి తదితర వైసిపి అభ్యర్థిలు పాల్గొన్నారు.