water
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

దాహం తీర్చండి జగన్…. ప్రభో

త్రాగడానికి నీరు అందుబాటులో లేక తమకాలనిలో నీరురాక గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నా ఎవరు పట్టించుకొనే నాధుడే కరువయ్యారని ముఖ్యమంత్రి తో తమ గోడును గ్రామస్తులు విన్న వించు కున్నారు. శనివారం మేము సిద్ధం కార్యక్రమంలో భాగంగా తుగ్గలి నుండి గుత్తి కి పోవు మార్గమద్యం జొన్నగిరి లోని మహిళలు ముఖ్యమంత్రి జగన్ కాన్వాయ్ ను అడ్డుకొన్నట్లు గ్రామస్తులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే మండల పరిధిలోని జొన్నగిరిలో చాలా రోజులనుండి త్రాగడానికి నీరులేక తీవ్ర ఇబ్బందులు పడు తున్నామని పంచాయితీ కార్యదర్శికి విన్నవించినా ఫలితం లేకపోయిందని ముఖ్యమంత్రి సమక్షంలో తమ ఆవేదనను వ్యక్తం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి దత్తత తీసుకున్న గ్రామ మయినప్పటికి గ్రామానికి నీరందించ లేకపోయారని మండిపడ్డారు.దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని త్వరలోనే మీకు నీరు అందిస్తామని తెలిపారని అన్నారు.