జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్ లోని గుజ్జుల రామకృష్ణారెడ్డి క్యాంప్ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మేల్యే, జాతీయ కౌన్సిల్ మెంబర్ గుజ్జుల రామకృష్ణారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ 1980లో ఆవిర్భవమైన భారతీయ జనతా పార్టీ 135 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఈ దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీ తిరస్కరించి, 1980 ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ 44 సంవత్సరాల అతి తక్కువ కాలంలోనే భారతీయ అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వాని ఆధ్వర్యంలో అంచులంచె లుగా ఎదిగిన భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను నమ్మి దేశ ప్రజలు 1996,1998, 1999, అధికారం కట్టబెట్టారు తిరిగి మళ్లీ నరేంద్ర మోడీ సారాధ్యంలో 2014, 2019 తిరుగులేని విజయం సాధించిన బిజెపి 2023 లో కూడా భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి రాబోతుందని అన్నారు. పెద్దపల్లి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ ని పెద్దపల్లిలో గెలిపించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి కానుకగా ఇవ్వవలసిందిగా పెద్దపల్లి పార్లమెంటు ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో మీసా అర్జున్ రావు, ఠాగూర్ రామ్ సింగ్, ఆది కేశవరావు, పిన్నింటి రాజు, కొంతం శ్రీనివాసరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాసరావు పర్స సమ్మయ్య, పల్లె సదానందం, జంగా చక్రధర్ రెడ్డి, అక్కేపల్లి క్రాంతి, ఎండీ ఫహీముద్దీన్, తుడి రవీందర్, చాత రాజు రమేష్, మోర మనోహర్, మెరుగు రవీందర్, కొమిరిశెట్టి రమేష్, తూముల మల్లారెడ్డి, మంతెన కృష్ణ, రేడపాక కృష్ణ,గర్రెపల్లి నారాయణస్వామి, మండేదుల జగన్, ఎల్లంకి రాజేందర్, చుంచు సంపత్, శ్రీనివాసమూర్తి, వాడక్కపూర్ ఆనంద్, వడ్నాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.