uttam-kcr
తెలంగాణ రాజకీయం

దొంగ పాస్‌పోర్టులు అమ్మి రాజకీయాల్లోకి రాలేదు

కరీంనగర్ పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం కాంట్రాక్టర్లను దోచుకుని రాజకీయం చేయడం లేదని విమర్శించారు. శనివారం గాంధీ భవన్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…దొంగ పాస్‌పోర్టులు అమ్మి రాజకీయాల్లోకి రాలేదని కెసిఆర్ పై ఫైరయ్యారు.తెలంగాణలో ఇవాళ ఉన్న పరిస్థితికి కారణం కెసిఆరేనని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో కెసిఆర్ ను జనమే బొంద పెడతారన్నారు. రాష్ట్ర పరిస్థితిపై అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దమ్ము కెసిఆర్‌కు లేదన్నారు. త్వరలో బిఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుందని చెప్పారు. 25మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి ఉత్తమ్‌.