ఆ పేదింట కొండంత విషాదం నెలకొంది… మానవతావాదులు గోరంత సహాయం చేస్తే తన కూతురు బతికి బయట పడుతుందంటూ ఆ పేద దంపతులు వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్ళితే…
ఎనిమిదేళ్ల రిషిత పుట్టుకతో చెవుడు, మూగ. పాపకు 4 ఏళ్ల వయసులో కోచిలర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయించారు. దీనికి గాను ఏడిఐపీ స్కీం లో కొంత అప్పు చేశారు. ఆ సమయంలో పాప తలలో ఒక మెషిన్ చెవి పైన ఒక మెషిన్అమర్చారు. మళ్ళీ పాపకి గత సంవత్సరం ఆపరేషన్ అయినా స్థానంలో ఇన్ఫెక్షన్ సోకి 5 లక్షలు అప్పు చేసి ఆపరేషన్ చేయించారు. కాగా ఇప్పుడు పాపకి చెవి పైన వున్న మెషిన్ లో సమస్య రావడంతో మెషిన్ మార్చాలని నూకల్స్ 8 ఖరీదు రూ.7.5 లక్షల ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారని పాప తండ్రి పోతు రాజశేఖర్ తెలిపారు. తాను ఓ బిల్డర్ దగ్గర సూపర్వైజర్ గా పని చేశానని, తనకు వచ్చే జీతమే కుటుంబం అవసరానికి సరిపోతుందని తెలిపారు.
గతంలో పాప కోసం హాస్పిటల్ చుట్టూ తిరిగితే ఆ పని కూడా పోయిందని, ఉన్న ఇల్లు కూడ అమ్మి పాప కోసమే కర్చు చేశామని బాధితుడు తెలిపాడు. ఇప్పుడున్న స్థితిలో పని చేసే పరిస్థితిలో లేనని, ట్రీట్ మెంట్ కూడా చేయించే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నాడు. కాగా ఆ చిన్న పాప కోసం చిన్న సహాయం చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుందామని కాంగ్రెస్ నాయకులు గంగుల సంతోష్ పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 7702488503 నంబర్ లో సంప్రదించవచ్చని తెలిపారు. దాతలు ముందుకు రావాలని కోరారు.
అలాగే సహాయం కోసం గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 7702488503
SBI
bank : 20343433912
IFSC : SBIN0014237. ద్వారా సహాయం చేయవచ్చని తెలిపారు.