jyothi rao phule
ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

ఆదర్శప్రాయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, స్ర్తీ విద్య కొరకు పాటుపడిన మహాత్మా జ్యోతిరావు పూలే అందరికి ఆదర్శప్రాయుడని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన పేర్కొన్నారు.. గురువారం మహాత్మా జ్యోతిరావు పూలే 198 వ జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆద్వర్యంలో నగరంలోని శరీన్ నగర్ లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.అలాగే  అక్కడే ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కూడా పూలమాల వేసి నివాళులు అర్పించారు.

 ఈసందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ ఆర్దికంగా గానీ, సామాజికం గానీ ఒక చైతన్యవంతమైన జీవితం సాగించేందుకు చదువు చాలా అవసరమని మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆనాడే చెప్పారన్నారు.. చెప్పడమే కాకుండా దానిని ఆచరించారన్నారు. కుల, లింగ, వివక్షతకు తావు లేకుండా విద్య, సమానత్వం ద్వారానే సామాజిక, ఆర్థిక సమున్నతికి బాటలు పడతాయనే జ్యోతిరావుపూలే ఆలోచనా విధానాన్ని ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఆయన సహచరి సావిత్రిబాయికి గురువుగా మారి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా  తీర్చిదిద్దారని కలెక్టర్  ఈ సందర్భంగా గుర్తుచేశారు. బాలికలకు, మహిళలకు చదువుకునేందుకు ప్రత్యేకంగా పాఠశాలలను నెలకొల్పారని, నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు ఆయన చేపట్టిన సంస్కరణలు చాలా గొప్పవని కలెక్టర్ తెలిపారు.