jagan-powerty
ఆంధ్రప్రదేశ్ రాజకీయం

జగన్ హయంలో ఆరు శాతానికి తగ్గిన పేదరికం

విజయవాడలో ముఖ్యమంత్రి జగన్ పై టిడిపి పార్టీ కు చెందిన వాళ్ళే దాడి చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. విజయవాడలో సిఎం జగన్ పై దాడి జరగడం బాధాకరమని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుఅన్నారు. ఏపి మొత్తం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎవ్వరూ చేయని విధంగా వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్నాయి. లక్ష 21 వేల మంది బ్రాహ్మణులకు సుమారు 800 కోట్లు  పెన్షన్ లు, పథకాలు అందాయి. టిడిపి పాలనలో  27 వేలు పెన్షన్ లు బ్రాహ్మణులకు ఉంటే,  నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత   50 వేల పెన్షన్ లు సిఎం జగన్ అందిస్తున్నా. బ్రహ్మణ కార్పొరేషన్ కు సమృద్ధిగా నిధులు వచ్చాయి. 2019,   24 ఎన్నికల్లో బ్రాహ్మణుల కు చంద్రబాబు ఒక్క సీటు ఇవ్వలేదు. సిఎం జగన్ మోహన్ రెడ్డి బ్రాహ్మణులకు గుర్తింపు ఇచ్చారు. సామాజిక ధర్మం పాటించిన వ్యక్తి సిఎం జగన్ మోహన్ రెడ్డి. బ్రహ్మణ కార్పొరేషన్ ద్వారా అందరికీ సమన్యాయం జరిగింది.

చంద్ర బాబు పాలనలో పెన్షన్ ఎందుకు పెంచలేదు, ఈరోజు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాపీ  కొడుతున్నారు. మా నవరత్నాలు సంక్షేమ పథకాలు అన్ని చంద్రబాబు కూటమి కాపీ కొడుతున్నారు. లంటీర్ వ్యవస్థ ను కూడా కాపీ కొడుతున్నారు. 2014 లో మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. గతంలో ఇదే కూటమి శ్రీవారి పాదాల చెంత ప్రత్యేక హోదా హామీ ఇచ్చి ఇప్పటికీ నెరవేర్చలేదు. ఆరోగ్యశ్రీ ద్వారా  ఒక్కొక్కరికి 25 లక్షలు లబ్ధి చేకూరుతుంది. చంద్రబాబు పాలనలో 12 శాతం పేదరికం ఉంది , నేడు సిఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో 6 శాతం కు తగ్గింది. సిఎం జగన్ మోహన్ రెడ్డి నీ పరుష పదజాలంతో టిడిపి నాయకులు ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియాలో సిఎం జగన్ పై  దుష్ర్పచారం చేస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ను గెలిపించాలని, తిరుపతి ఎమ్మెల్యే భూమన అభినయ్ రెడ్డి ను గెలిపించాలని బ్రహ్మణ సంఘాలను, పెద్దలను కోరుతున్నానని అన్నారు.