రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి మొదలయింది. గురువారం నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగను్నాయి. నాలుగో దశలో ఏపీ, తెలంగాణకు ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ వుంటుంది. లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగింది.. ఏప్రిల్ 19న ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ జూన్ 1న ముగుస్తుంది. తొలి దశ ఎన్నికల్లో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణ సహా పది రాష్ట్రాల్లో నాలుగో విడతలో పోలింగ్ జరగనుంది. మే 13న పోలింగ్ జరుగుతుంది. అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను దాదాపుగా ప్రకటించేశాయి. అయితే, బీఫామ్ చేతికి వచ్చేంత వరకు కొందరు అభ్యర్థులకు టెన్షన్ తప్పని పరిస్థితి ఉంది.