నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా జగనన్న నన్ను నిలబెట్టడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చిందని మంత్రి రోజా అన్నారు. జగనన్న ఆశీర్వాదంతో నగరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మూడోసారి నామినేషన్ వేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఆ భగవంతుని ఆశీస్సులు , జగనన్న ఆశీస్సులతో ఆశీస్సులతో నేను మంత్రిని అయ్యానని చెప్పారు. జగనన్న అండగా ఉన్న ఆడబిడ్డను నేను. నగరి అంటే రోజా రోజా అంటే నగరి అని ఆ రోజే చెప్పానని గుర్తు చేశారు. రోజా మాట్లాడుతూ ఈరోజు తలుచుకుంటే ఇది నామినేషన్ ర్యాలీయ లేక విజయోత్సవ ర్యాలీ అంటూ వ్యాఖ్యానించారు. జగనన్న చేసినటువంటి సంక్షేమ పథకాలే వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థులకు అండగా ఉంటుందని రోజా ఉద్ఘటన.
ఓపిక ఉన్నంతవరకు కాదు ఊపిరి ఉన్నంతవరకు నగిరి ప్రజలకు సేవ చేసుకుంటానని శపథం చేసారు. వెన్నుపోటు పొడిచే నాయకులకు వెన్ను విరిచేలాగా ఈరోజు ర్యాలీ జరిగిందని, అలాగే నగరిలో ఉన్న ఐదు మండలాల్లో అభివృద్ధి చేశానని ఆమె తెలిపారు