హనుమాన్ జయంతిని పురస్కరించుకొని భజరంగ్ దళ్ , విశ్వ హిందు పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి , ఎమ్మెల్యే రాజా సింగ్ , మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వి.హెచ్.పి జాతీయ నాయకులతో కలిసి యాత్రను గౌలిగూడా రామమందిర్ నుండు జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందు రామమందిరంలో హనుమంతుడికి యజ్ఞము, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున యువకులు , హనుమాన్ భక్తులు కాషాయ జెండాలను చేతబట్టి శుభయాత్రకు తరలి వచ్చారు. ఈ శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈస్ట్ జోన్ డీసీపీ రావుల గిరిధర్ రావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పటు చేశారు.
ఎండలు అధికంగా ఉండటంతో శభయాత్రలో పాల్గొనే భక్తులకు అడుగడుగునా స్వచ్ఛంద సంస్థలు నిర్వాహకులు … చల్లటి నీరు , మజ్జిగ , అల్పాహారం అందిస్తున్నారు. ఈ యాత్ర జై శ్రీరామ్ , జై భోలో హనుమాన్ కు జై అనే నినాదాలతో ముందుకు సాగింది.