visveswar reddy
జాతీయం రాజకీయం

బీజేపీ గెలుపు ఖాయం

చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ పై బిజెపి జెండా ఎగుర వేయడం ఖాయమన్నారు ఆ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మహేశ్వరం నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలోని ప్రశాంత్ నగర్, గాయత్రి నగర్, లెనిన్ నగర్, బడంగ్ పేట్ లోని పలు ప్రాంతాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీని మరోసారి ప్రధానమంత్రి చేసేందుకు యావత్ భారతదేశం ఎదురు చూస్తుందని అన్నారు. దేశ అభివృద్ధి కోసం కుటుంబాన్ని కూడా త్యాగం చేసి శ్రమిస్తున్న నరేంద్ర మోడీకి చేవెళ్ల ప్రజలంతా అండగా నిలవాలని ఆయన కోరారు. దేశ ఐక్యత, ప్రపంచ శాంతి కోసం నరేంద్ర మోడీ నిరంతరం శ్రమిస్తున్నారని ఆయన చెప్పారు. భారతీయ జనతా పార్టీని ఓడించ లేక ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయని అయినప్పటికీ నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. విప్లవాత్మక నిర్ణయాలతో నరేంద్ర మోడీ దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేశారని, ఆయన చిత్తశుద్ధి అంకితభావం కారణంగానే ఇవాళ భారతదేశ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు.

గ్యారెంటీ ల పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని, సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించడం ద్వారా ప్రజలంతా బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రజా ఆశీర్వాద యాత్రలో మహేశ్వరం నియోజకవర్గ బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి అనుచరులు, అభిమానులు  పాల్గొన్నారు.