aadhar update
జాతీయం ముఖ్యాంశాలు

డిసెంబర్ 14 వరకు ఆధార్ అప్ డేట్

ఆధార్ కార్డ్‌లోని వివరాలను పూర్తి ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు చివరి తేదీ ‍‌ దగ్గర పడుతోంది. ఫ్రీ అప్‌డేషన్‌ గడువును ఈ ఏడాది డిసెంబర్‌ 14వ తేదీ (14 December 2023) వరకు భారత ప్రభుత్వం గతంలోనే పెంచింది. అంతకు ముందు సెప్టెంబరు 14, 2023 వరకూ గడువు ఉండేది. ప్రజలకు మరో ఛాన్స్‌ ఇచ్చిన ప్రభుత్వం, ఈ గడువును 3 నెలలు పెంచింది.
మీ ఆధార్‌ కార్డ్‌లో… మీ పుట్టిన తేదీ తప్పుగా ఉన్నా, పేరులో స్పెల్లింగ్‌ మిస్టేక్స్‌ ఉన్నా, జెండర్‌లో తప్పు దొర్లినా, మీ అడ్రస్‌, మొబైల్‌ నెంబర్‌, ఈ-మెయిల్‌ ఐడీ మారినా ఇప్పుడు ఫ్రీగా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. అయితే, గడువు దగ్గర పడుతోందన్న విషయాన్ని గుర్తుంచుకోండి.