రేణిగుంటలో స్వర్ణాంధ్ర సాకార యాత్ర జరిగింది. ఈ కార్యక్రమానికి జనాలు భారీగా తరలివచ్చారు. హిందూపురం ఎమ్మెల్యే బాల కృష్ణ మాట్లాడుతూ యువత మేల్కొనాలి..కూటమిని గెలిపించుకోవాలి. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు. అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూసిన వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ అడుగుజాడలో నడిచిన వ్యక్తి చంద్రబాబు. ప్రజల కోసమే నిరంతరం పనిచేసిన మహోన్నత వ్యక్తి చంద్రబాబు. వైసిపి లాంటి ప్రభుత్వాన్ని తెలుగు ప్రజలు గతంలో ఎప్పుడూ చూడలేదు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించండి. లోటు బడ్జెట్ తో అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. ఎపికి ఒక్క పరిశ్రమ గత ఐదేళ్ళలో రాలేదు. శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంటలో ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చింది చంద్రబాబు. సిద్దం..సిద్థమని ప్రజలను మరోసారి మోసం చేసేందుకు జగన్ సిద్థమయ్యాడు. యువతను గంజాయికి బానిస చేశారు. రైతులను నట్టేట ముంచారని అన్నారు.
రైతుల ఆత్మహత్యలు దేశంలోనే మొదటి స్థానంలో ఆంద్రప్రదేశ్ ఉంది. ఇక నీ ఆటలు సాగవు జగన్. రాబోయే ఎన్నికల్లో నీ నడ్డివిరిచేందుకు జనం సిద్ధంగా ఉన్నారు జగన్. అందరూ ఒక్కటై జగన్ కు వచ్చే ఎన్నికల్లో బుద్థి చెప్పాలి. అభివృద్ధి-అరాచకమా, స్వర్ణయుగమా-రాతియుగం కావాలా ప్రజలే ఆలోచించండి. సూపర్ సిక్స్ పథకాలే ప్రజలకు శ్రీరామ రక్ష. ఇచ్చిన మాట ఖచ్చితంగా చంద్రబాబు నెరవేరుస్తారు. జగన్ మేనిఫెస్టో అంతా బూటకమే..రౌడీ రాజ్యం మనకొద్దు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిపై హత్యాయత్నం చేయడం దారుణం. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంతా అరాచకమే చేశారు. ప్రజాధనాన్ని దోచేసిన ఘనుడు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. ప్రతి పనిలోను కమిషన్, భూకబ్జాలకు కేరాఫ్ బియ్యపు మధుసూదన్ రెడ్డి. సూళ్ళూరుపేటలో కొకైన్, డ్రగ్స్ అమ్ముతున్నారని అన్నారు.
మా అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిపై 16అక్రమ కేసులు పెట్టారు. అక్రమ కేసులకు మా కార్యకర్తలు భయపడలేదు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తాడు. ఎవరికీ భయపడొద్దు..ఎన్నికల యుద్థానికి సిద్ధంగా ఉండండి. సమసమాజ స్థాపన కోసం నడుంబిగించండి. ఓట్లను అమ్ముకోకండి..నమ్ముకోండని అన్నారు