తెలంగాణ రాజకీయం

కరీంనగర్  లో త్రిముఖ పోటీ

తెలంగాణ రాష్ట్రంలో అందరి‌ దృష్టి కరీంనగర్ పార్లమెంటు స్థానంపై‌ ఉంది. ఇక్కడ ‌బలమైన అభ్యర్థులు ‌బరిలొకి దిగడంతో పొరు మరింత అసక్తి‌రే రేపుతుంది. అధికార పార్టీ కాంగ్రెస్ అరు‌ గ్యారంటీలపై‌‌ నమ్మకం పెట్టుకుంటే, బిజేపి కేంద్ర ప్రభుత్వం పథకాలతో పాటు, హిందుత్వ వాదం, అయోధ్య ‌రామాలయంను నమ్ముకుంది. బిఆర్ఎస్ గతంలో చేసిన అభివృద్ధి సెంటిమెంట్ అంశాలను నమ్ముకుంది. ఈ మూడు పార్టీలు ప్రచార స్పీడ్‎తో దూకుడు పెంచాయి.కరీంనగర్‎లో రాజకీయ ‌చైతన్యం ఎక్కువ. ఇక్కడ అప్పటి పీపుల్స్ వార్స్ నుంచి ‌తెలంగాణ ఉద్యమం‌ దాక ఎన్నో‌ఉద్యమాలు జరిగాయి. ప్రజా చైతన్యంతో‌ ప్రభుత్వాలు దిగి వచ్చాయి. ప్రతి ఎన్నికలలో ‌కూడా కరీంనగర్ ‌ప్రజలు విభిన్నమైన తీర్పుని ఇస్తారు. ఇప్పుడు ‌జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలలో ప్రజలు ఏ పక్షాన నిలబడుతారో మరింత ‌ఆసక్తిని రేపుతుంది. కరీంనగర్ ‌పార్లమెంటు‌ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు‌ ఉన్నాయి. మొత్తం 17 లక్షల 92 వేలకి పైగా ఓట్లు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ ‌నుంచి వెలిచాల రాజేందర్ రావు, బీజేపి నుంచి బండిసంజయ్ కుమార్, బిఅర్ఎస్ ‌నుంచి వినోద్ కుమార్ బరిలొకి దిగుతున్నారు. గత ఎన్నికలలో బండిసంజయ్ వర్సెస్ వినోద్ కుమార్ మధ్యనే పోటి ఉంది.

ఇప్పుడు కాంగ్రెస్ ‌నుంచి కొత్త అభ్యర్థి బరిలొకి దిగుతున్నారు. బిఅర్ఎస్, బిజెపి అభ్యర్థుల పేర్లు చాల రోజుల క్రితమే ప్రకటించారు. కాంగ్రెస్ ‌మాత్రం పేరు ప్రకటనలలో ఆలస్యం చేసింది. ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ ‌దాఖలు చేసారు. ఇక అభ్యర్థులు అంతా‌ ప్రచారంపై దృష్టి పెట్టారు.కరీంనగర్ పార్లమెంటు పరిధిలో అధికంగా రైతుల ఓట్లే ఉన్నాయి. ప్రతిపక్షాలు రైతుల సమస్యలపైన ఫోకస్ చేస్తున్నాయి. ఇప్పటికే బిజేపి అభ్యర్థి‌ సంజయ్ కొనుగోలు కేంద్రాలకి వెళ్ళి వరి ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ గురించి ‌మాట్లాడుతున్నారు. వినోద్ కుమార్ కూడ ఇదే అంశంపై‌‌ దృష్టి పెట్టారు. కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలకి కౌంటర్ ఇస్తున్నారు. రైతు‌సమస్యల పరిష్కారంలో తమకే చిత్తశుద్ధి ‌ఉందని చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో రైతులతో పాటు చేనేత కార్మికులు గల్ఫ్ కార్మికులు గెలుపు ఓటములపై ప్రభావం చూపనున్నారు. ఇప్పటికే నేత కార్మికుల సమస్యలపైనా మూడు పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి.