సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు: చినరాజప్ప
మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సీఎం జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు వల్ల నిర్వాసితులయిన వారికి పునరావాసం కల్పించకుండానే గిరిజనులను అక్కడి నుంచి తరలిస్తున్నారని ఆయన చెప్పారు.
బలవంతంగా తరలించే ప్రక్రియను జాతీయ ఎస్టీ కమిషన్ నిలదీసిందని చినరాజప్ప అన్నారు. నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పునరావాస కార్యక్రమాలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.