జనసేన పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో 21 స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం పరిస్తితిని పక్కన పెడితే.. 20 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములు ఎలా ఉన్నా యనేది ఆసక్తిగా మారింది. ఇతర నియోజకవర్గాల్లో ముఖ్యంగా ఫస్ట్ ఓడిపోయే సీటు ఇదే నంటూ.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ సీటును జనసేనకు ఇచ్చి టీడీపీ కూడా తప్పు చేసిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అదే.. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం. జాతీయ, రాష్ట్ర స్థాయి.. స్థానిక స్థాయిలో ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతికి ఎంతటి విశిష్టత ఉందో చెప్పక్కర్లేదు. వైసీపీ నుంచి వచ్చిన నేతకు సీటు ఇవ్వడమే అది పెద్ద తప్పుగా కూటమిలోని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఇక్కడ జనసేన పోటీ చేస్తుండడంతో ఎవరు గెలుస్తారన్న దానిపై చాలా సర్వేలు నడుస్తున్నాయి. వాటిలో చాలా సర్వేలు జనసేనకు అనుకూలంగా వస్తున్నాయి.
తిరుపతి అసెంబ్లీ పరిధిలోని తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్ మండలాలను తీసుకుంటే.. గత ఎన్నికల వరకు కూడా..తిరుపతి రూరల్ పరిధిలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. ఇదే ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచింది. అలాంటి రూరల్ మండలాల్లోనూ.. వైసీపీ మాటే వినిపిస్తుండటం.. ముఖ్యంగా భూమన అభినయ్ రెడ్డి గురించి పాజిటివ్ టాక్ రావడం గమనార్హం. ఇక, తిరుపతి అర్బన్ లో ఎలానూ.. భూమన కుటుంబానికి మంచి పట్టుంది. ఇక్కడ ఆయనకే ప్రజలు జేజేలు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది.కానీ, ఎటొచ్చీ.. బీజేపీకి అంతో ఇంతో మద్దతు ఉన్న అర్బన్ ప్రాంతంనూ ఇక్కడి ప్రజల్లో బీజేపీ మాట వినిపించడంలేదు. జనసేన మాట కూడా.. వినిపించడం లేదు.దీనికి కారణం.. జనసేన తరఫున ఎక్కడో చిత్తూరు నుంచి తీసుకువచ్చిన ఆరణి శ్రీనివాసులకు.. టికెట్ ఇవ్వడం.. ఇచ్చే ముందు.. కనీసం తమతో చర్చించలేదన్న వాదన వినిపి స్తుండడం వంటివి పెద్ద మైనస్ అయింది. ఇక, పవన్ నేరుగా రంగంలోకి దిగి బుజ్జగించినా.. ఆ తరహా కలివిడి అయితే.. నేతల మధ్య కనిపించడం లేదు.
జెండాలు పట్టుకుని తిరుగుతున్నప్పటికీ కనీసం వారి కుటుంబ సభ్యులకు కూడా జనసేన అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పకపోవడం ఈ నేతల స్పెషాలిటీ.. అంటే పార్టీలో ఉంటూనే జనసేన అభ్యర్థికి సహాయ నిరాకరణ చేస్తున్నట్లే కనిపిస్తుంది. అటు టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు ఇతర నేతలు కూడా అంటీముట్ట నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇది జనసేనకు తొలి ఎదురు దెబ్బ. అంతేకాదు.. కూటమి పార్టీల ఓట్లు కూడా.. జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు బదిలీ అయ్యే అవకాశం పరిస్థితి కనిపించడం లేదు. మొత్తంగా చూస్తే.. జనసేన ఓడిపోయే తొలి స్థానం తిరుపతేనని… అసలు జనసేన ఈ సీటే గెలిస్తే ఆ పార్టీకి 21కు 18 సీట్లు పక్కాయే అంటున్నారు. దీంతో ఇది చూసిన తర్వాతనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి తిరుపతిలో రోడ్ షో చేశారు. సభను నిర్వహించారు. అయినా పరిస్థితిలో మాత్రం మార్పు లేదంటున్నారు.