తెలంగాణ రాజకీయం

గిట్టుబాటు ధరలు లేకపోవడానికి వారే కారణం

మోదీ, అమిత్ షా సంక్రాంతి గంగిరెద్దుల్లా రాష్ట్రానికి వస్తున్నారు’ అని బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వికారాబాద్‌కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రాణహిత-చేవెళ్లను పడావు పెట్టి ఈ ప్రాంతాలను ఎండబెట్టిందని తండూరు జనజాతర సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.బీఆర్ఎస్-బీజేపీ పార్టీల కారణంగానే రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తండూరు జనజాతర సభలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘వికారాబాద్-అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ ఈరోజు కాలుష్యమైపోయింది. మన ప్రాంతం అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ను గెలిపించు కోవాలి. పధ్మనాభ స్వామి సాక్షిగా చెప్తున్న ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తాను. 7,500 కోట్ల రైతు భరోసా నిధులును రైతు ఖాతాల్లో వేసాం. మోదీ, అమిత్ షా సంక్రాంతి గంగిరెద్దుల్లా రాష్ట్రానికి వస్తున్నారు’ అని బీఆర్ఎస్, బీజేపీలపై మండిపడ్డారు.

తెలంగాణలో రూ.500 లకే గ్యాస్ సిలిండర్ సహా ఆరు గ్యారంటీలు అమలు చేస్తున్నాంమని ప్రియాంక గాంధీ అన్నారు. అతికొద్ది మంది ధనమంతుల కోసం మాత్రమే బీజేపీ పనిచేస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని.. ఆ ప్రయత్నాలను అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘నిరుపేద, మధ్యతరగతి, సామాన్యుల కోసం బీజేపీ ఎప్పుడు పనిచేయలేదు. ప్రజలపై అధిక పన్నుల భారం మోపారు. రైతులు నష్టపోతున్నా కేంద్రం వారికి ఎలాంటి సహకారం అందించడం లేదు. బీజేపీ ఎప్పుడు ప్రజల కోసం పనిచేయలేదు. ప్రజలపై ట్యాక్స్ య భారం మోపింది.చిన్న వ్యాపారుల సమస్యలు ఏటా పెరుగుతున్నాయి. నోట్ల రద్దు, జీఎస్టీ వసూళ్ల వల్ల సామాన్యుల నడ్డి విరిగిపోయింది. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ పార్టీ హోదా అడిగినా ఇవ్వలేదు. ఐఐఎం, మెడికల్ కాలేజ్, నవోదయ వంటివి అడిగినా ఇవ్వలేదు. రుణమాఫీ, కాజీపేట రైల్వే కోచ్ వంటివి అడిగినా ఇవ్వలేదు. పేద రైతులు రుణాలు చెల్లించలేక ఆత్మ హత్యలు చేసుకుంటున్నారు. 16 లక్షల కోట్ల రూపాయలను ధనవంతులకు రుణమాఫీ చేశారు.

మీరు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము బడాబడా వ్యాపారవేత్తల చేతుల్లోకి వెళ్తోంది. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ కేవలం ధనవంతుల విషయంలోనే జరిగింది. దేశంలో 70 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. దేశంలో 30  లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణకు పదేళ్లలో మోదీ ఏం ఇచ్చారు? అధికారం కోసం మోదీ ప్రభుత్వం అబద్దాలు చెబుతోంది. ఇందిరా గాంధీని ఆదరించిన నేల ఇది. సోనియా గాంధీని మీ తల్లిలాగా చూసుకుంటున్నారు. తెలంగాణతో మాకు ప్రత్యేక అనుబంధం ఉంది. మహాత్మా గాంధీ విధానాలతో కాంగ్రెస్ ముందుకు వెళ్తోంది’ అని ప్రియాంక గాంధీ అన్నారు.