కాళేశ్వరం ప్రాజెక్టు.. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తానే ఓ భగీరథుడిని అని చెప్పుకొని మరీ నిర్మించిన ప్రాజెక్టు.. బట్ ఇప్పుడా ప్రాజెక్ట్ పనికి రాకుండా పోయింది. ఇప్పుడు అక్కడ కనిపించేవి కుంగిన పిల్లర్లు.. బీటలు వారిన గోడలు.. అక్కడ కుంగింది రైతుల ఆశలు, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా.. ఇప్పుడా లిస్ట్‌లో చేరింది ఎల్ అండ్ టీ కంపెనీ కూడా.. అదేంటి కంపెనీకి ఏమైంది? చేసిన పనికి డబ్బు తీసుకున్నారు కదా.. అంటారా.. ? కాదు.. వారికి కూడా డ్యామేజ్ జరిగిందిలార్సెన్ అండ్ టూబ్రో.. షార్ట్‌గా ఎల్ అండ్ టీ.. దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రస్టేజీయస్ ప్రాజెక్టులు చేపట్టిన కంపెనీ.. దేశంలో ఎన్నో డ్యామ్‌లతో పాటు రోడ్లు, భవనాలు నిర్మించిన కంపెనీ ఎల్ అండ్ టీ.. ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్‌లో కూడా 4 వేల 396 కోట్ల నికర లాభాలను సాధించింది ఈ కంపెనీ.. గతేడాది మార్చి క్వార్టర్‌తో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ.. బట్ ఇప్పుడా కంపెనీ ఓ రాష్ట్ర ప్రభుత్వానికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం కాళేశ్వరం ప్రాజెక్ట్..కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్‌కు ఓ లెటర్ వచ్చింది.
అది ఉత్తరాఖండ్ ప్రాజెక్టుల అభివృద్ధి సంస్థ రాసిన లెటర్.. అందులో సూటిగా ఓ ప్రశ్న ఉంది. అదేంటంటే మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి కారణం ఎవరు? ఈ వివరాలను వీలైనంత త్వరగా తెలపగలరు. ఇది ఆ లెటర్ సారాంశం.. అదేంటి ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు ఏంటి లింక్ అనే కదా మీ డౌట్.. ఉంది. ఉత్తరాఖండ్‌లో గౌలా నదిపై జమ్రాని డ్యాం నిర్మించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ఫిబ్రవరి 26న టెండర్ పిలిచింది. ఇందులో 150.6 మీటర్ల ఎత్తుతో కాంక్రీటు గ్రావిటీ డ్యాం నిర్మాణతో పాటు.. ఇతర అనుబంధ పనులకు L&T టెండరు వేసింది. ఇక్కడి వరకు బాగానే ఉంది.. అయితే తాము ఇప్పటి వరకు చేపట్టిన ప్రాజెక్టులలో ఎలాంటి వైఫల్యాలు లేవని.. ఇది మా స్టాండర్డ్స్‌కు ఎగ్జాంపుల్ అని చెప్పింది L&T.. అంతేకాదు ఈ అఫిడవిట్‌తో పాటు మేడిగడ్డ బ్యారేజికి సంబంధించిన వివరాలను కూడా సమ ర్పించింది. ఎవరైనా చెప్పిందల్లా నమ్మేయరు కదా.. అది కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి.. ఎందుకంటే ప్రాజెక్ట్ ఘన కీర్తి గురించి ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రచారం జరిగింది.
సో ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెంటనే అలర్టైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీర్‌కు లెటర్ రాసింది. మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను నిర్మించింది L&T అని న్యూస్‌లో చూశాం.. మరి ప్రాజెక్టు కుంగడానికి L&T కారణమా? అని ప్రశ్నించింది.క్వశ్చన్ సింపుల్‌గానే ఉంది.. కానీ దానికి ఆన్సర్ చెప్పడమే ఇప్పుడు కాస్త కంగారుగా ఉంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు వైఫల్యానికి కారణం ఎల్ అండ్ టీనా? లేక కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లా? అని తేల్చాల్సిన పని తెలంగాణ నీటి పారుదల శాఖపై పడింది. అదొక్కటే కాదు.. ఉత్తరాఖండ్ ప్రభుత్వం మరిన్ని ప్రశ్నలు కూడా సంధించింది. మేడిగడ్డ నిర్మాణానికి బాధ్యులైన కాంట్రాక్టు సంస్థ ఎవరు? సంయుక్త భాగస్వామ్యం అయితే ఎవరి వాటా ఎంత? బ్యారేజీ ప్రధాన స్ట్రక్చర్‌లో వైఫల్యం జరిగిందా? ఈ ఘటన నిర్మాణం సమయంలోనా లేక డిఫెక్ట్ లయబులిటీ పిరియడ్‌లోనా? లేక ఆ తర్వాత జరిగిందా? ఈ వైఫల్యం విపత్తు వల్ల జరిగిందా? లేదా? అనేది కూడా నిర్ధారించాలని కోరింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం..అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్.. ప్రభుత్వానికి ఓ లెటర్ రాశారు. అందులో మేడిగడ్డ బ్యారేజీ పని పూర్తయినట్లు పొరపాటున పేర్కొన్నాము.
ఈ తప్పును క్షమించాలని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కోరారు. దీంతోపాటు దెబ్బతిన్న బ్యారేజీని సొంత ఖర్చుతో బాగు చేయాల్సిన బాధ్యత.. ఏజెన్సీదేనని, లేకుంటే చర్యలు తీసుకోవడంతోపాటు జరిగిన నష్టాన్ని.. ఆ సంస్థ నుంచి వసూలు చేయాలని ఆ లేఖలో కోరారు ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్. అంటే ఇక్కడ L&T బాధ్యత వహించే అవకాశం కనిపిస్తోంది.సో ఇప్పుడు తెలంగాణ నీటి పారుదలశాఖ ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనేది కాస్త ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఆ సమాధానంపైనే L&T టెండర్ ఆధారపడి ఉన్నట్టు కని పిస్తోంది. నిజానికి ఎంతో చరిత్ర ఉన్న L&T చరిత్రలో ఓ మాయని మచ్చగా కాళేశ్వరం ప్రాజెక్ట్ నిలిచినట్టు కనిపిస్తోంది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంతోనే కదా.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆ కంపెనీ సామర్థ్యంపై అను మానాలు పెరిగింది? అందుకే కదా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కంపెనీ మాటలను నమ్మకుండా.. తెలంగాణను వివరణ కోరింది. ఇటు బీఆర్ఎస్‌కే కాదు.. L&Tకి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు భస్మాసుర హస్తంగా మారినట్టు కనిపిస్తోంది పరిస్థితి.