ఆంధ్రప్రదేశ్

సీఎం జ‌గ‌న్‌కు ఎంపీ ర‌ఘురామ‌ మరో లేఖ

విశాఖ భూముల కుంభకోణం ప్ర‌స్తావ‌న‌

ఎస్సార్సీపీ అసంతృప్త ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు సీఎం జ‌గ‌న్‌కు మరో లేఖ రాశారు. విశాఖ భూముల కుంభకోణం అంశాన్ని ఆయ‌న ఈ లేఖ‌లో ప్ర‌స్తావించారు. విశాఖ భూముల కుంభకోణంపై గతంలో ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ జరిపించి, ఈ భూ కుంభకోణంలో పాలుపంచుకున్న వారందరి పైనా తగిన చర్యలు తీసుకోవాలని, విశాఖ నగరంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న విషయాలను ప్రజలకు తెలియజేయాలని ముఖ్యమంత్రి జ‌గ‌న్ ను కోరుతున్నాన‌ని చెప్పారు.

అక్ర‌మాల‌కు పాల్ప‌డిన రాజ‌కీయ నాయ‌కులు, అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న అన్నారు. విశాఖ భూ కుంభకోణంలో జరుగుతున్న పరిణామాలపై ఎలాంటి ప‌క్ష‌పాతం లేకుండా దర్యాప్తు జ‌రిపించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు.