ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

జూన్ నెలలో పెరిగిన శ్రీవారి హుండీ ఆదాయం

జూన్ మాసంలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం పెరిగిందని తిరుమల తిరుపతి గణాంకాలు చెబుతున్నాయి. జూన్ మాసంలో శ్రీవారిని 4లక్షల 14వేల 674 మంది భక్తులు దర్శించుకోగా… హుండీ ద్వారా 36కోట్ల 2లక్షల ఆదాయం లభించినట్టు టీటీడీ వెల్లడించింది. 1లక్షా 67వేల396 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.