ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కె.తారక రామారావు ఇంకా ఓటమిని జీర్ణించు కోలేకపోతున్నారు. ఎన్నికల పూర్తైయి దాదాపు ఏడు నెలలు కావస్తున్నా.. మేము ప్రచారంలో కొన్ని మెలుకువలు పాటిస్తే గెలిచే వారిమేమోననే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా కేటీఆర్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు దఫాల్లో అనేక కీలకమైన పథకాలను అమలు చేసిందన్నారు. రైతుబంధు,రైతు రుణమాఫీ,కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్,రైతు భరోసా,రైతులకు ఇన్సూరెన్స్, చేనేతకు చేయూత, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, పల్లె, పట్టణ ప్రగతి, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ స్థాపన, ప్రతీ నియోజకవర్గానికి మెరుగైన గురుకులాలు వంటి అనేక స్కీమ్స్, అభివృద్ధి పనులను తమ సర్కార్ ఇంప్లిమెంట్ చేయగలిగిందన్నారు.
అయితే తమ ప్రభుత్వ హయాంలో అమలైన పథకాల గురించి గత శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రజలకు స్పష్టంగా వివరించడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైందనే అభిప్రాయాన్ని ఆయన ఇప్పటికీ వెలిబుచ్చడం విస్మయం కలిగిస్తోంది. ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా కేటీఆర్ లో ఉన్న అధికార దాహం ఇంకా పోనట్లే అర్థమవుతుంది. అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకనే ఆయన ఈ రకమైన స్టేట్మెంట్లు ఇస్తున్నట్లు..తెలుస్తోంది. అందుకే ఈసారి లోక్సభ ఎన్నికల్లో గనుక బీఆర్ఎస్కు పూర్తి వ్యతిరేకమైన ఫలితాలు వస్తే ఆయన అసలు తట్టుకోలేరని విమర్శకులు అంచనా వేస్తున్నారు.