collector
తెలంగాణ ముఖ్యాంశాలు

జిల్లా అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫెరెన్స్

జిల్లాలలో గత  రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాల స్థితి గతులను తెలుసుకోవడం, అలాగే ప్రజలను అప్రమత్తం చేసేందుకు జిల్లా కలెక్టర్లకు తగు  చర్యల నిమిత్తం హైదరాబాదు నుండి  సిఎస్ శాంతి కుమారి జిల్లా కలెక్టర్లతో సెల్  కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, మునిసిపల్ కమిషనర్ షేక్ రిజ్వన్ పాషా, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.    తరువాత కలెక్టర్ సంబంధిత జిల్లా అధికారులు తహశిల్దార్లతో అన్నీ మండలలో నెలకొన్న పరిస్థితి ని   వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా కలెక్టర్  అడిగి తెలుసుకున్నారు  

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ…గత  48 గంటల నుండి వర్షాల నేపథ్యంలో అన్నీ శాఖల  అధికారులు  అలర్ట్ గా ఉండి సమన్వయం గా పని చేస్తున్నారని  అభినందించారు. దెబ్బతిన్న ఇళ్ల వివరాలు, కోతకు  గురైన  రోడ్ లు , కల్వర్టు ల పరిస్థితి, నిండిన చెరువుల వివరాలు , ప్రాణ, పంట  నష్టం వివరాలు, తాగు నీటి    సరఫరా , కరెంట్ పోల్స్, ట్రాన్ఫర్మార్ల డ్యామేజ్ తదితర  అంశాల పైన  అన్నీ  మండలాల  తహసీల్దార్ లతో గూగుల్ మీట్ ద్వారా కలెక్టర్ మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు
ఖానాపురం  మండల కు సంబందించి  16 ఇళ్ళు పాక్షికంగా  దెబ్బ తిన్నాయని, 24 చెరువులు  నిండి పోయాయాని.. అన్నీ ఓవర్ ఫ్లో అవుతున్నాయని.., 24 అడుగుల  నీటి మట్టం  తో  పాఖలా  చెరువు నిండి ఉందని… ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని  తహసీల్దార్ చెప్పారు. నర్సంపేట కి సంబందించి చిన్న, పెద్ద చెరువులు  కలిపి  69 ఉన్నాయని… మాదన్నపేట చెరువు ఫీట్ న్నర మత్తడి  పోస్తుందని… 10 ఇళ్ళు దెబ్బతిన్నాయని.. ఇందుకు సంబందించి  బిల్స్ సబ్మిట్ చేశామని… మగ్ధంపురం, గురిజాల వద్ద  రోడ్ బ్లాక్ చేశామని  ప్రజలను  అప్రమత్తం చేశామన్నారు.
వర్ధన్నపేట  కు సంబందించి  11 ఇళ్ళు పాక్షికంగా  దెబ్బ తిన్నాయని.. ఇప్పల కుంట , పెరుమాండ్ల  కుంట చెరువు  కట్టలు  తెగిపోయాయని… 68 చెరువులకు  గాను   58 చెరువు లు పూర్తి స్థాయిలో నిండాయని.. అందులో 15 చెరువులు  ఓవర్ ఫ్లో అవుతున్నాయాన్నారు. ఆకేరు  వాగు  ఉదృతం గా ప్రవేహిస్తున్నాదని…
ఇల్లంద లో 16 ఇళ్ల లకు  నీరు  చేరాయని.. గత  నాలుగు  రోజుల  నుండి బాధితులకు  భోజనాలు  ఆరెంజ్ చేశామని తహసీల్దార్ తెలిపారు
ఆకేరు  వాగు, కాజ్  వే ల దగ్గర   విఆర్ఏ లను,  పోలీస్ సిబ్బంది ని పెట్టాలని కలెక్టర్ ఆదేశాలు  జారీ  చేసారు. వరద  నీరు ఆగి  ఉండకుండా  చేయాలని…. ఆ తరువాత శానిటేషన్ ప్రక్రియ ను సరిగ్గా నిర్వహించాలన్నారు. దోమలు  ప్రభలకుండా నివారణ  చర్యలు  తీసుకోవాలని  డీపీఓ ని కలెక్టర్ ఆదేశించారు. తాగు  నీటి  సరఫరా కు ఎలాంటి అవంతరాయం  లేకుండ చూడాలని  మిషన్  భగీరథ  అధికారులకు  తెలిపారు. ప్రజలు కూడా చాలా అప్రమత్తం గా ఉండాలని.. వరద  నీరు  ప్రవహిస్తున్న రోడ్ ల వద్దకు  రాకూడదని… అత్యవసరం  అయితేనే  బయటికి  రావాలని  కలెక్టర్ సూచించారు.  జిల్లా లో కురుస్తున్న వర్షాల వలన లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.  

లోతట్టు ప్రాంతాలలో శిదిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసిస్తున్న వారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించాలని  అన్నారు. పునరావాస కేంద్రాలలో.నివసించే ప్రజలకు బోజన వసతులు  కల్పించేందుకు ఏర్పాటు చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలోని లోతట్టు ప్రాంతాల్లోని కాజ్ వేలు, చెరువులు ప్రమాదఘటికలు ఉన్న ప్రాంతాలకు పిల్లలు సరదా గా  సెల్ఫిలకోసం వెళ్లుటకు ప్రయత్నాలు చేస్తారు.. ఎట్టి పరిస్థితులలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఇంటి నుంచి పిల్లలను బయటకు వెళ్ళ కుండా చూసుకోవాలని, అదేవిధంగా పోలీసు యంత్రాంగం ,రెవెన్యూ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

జిల్లాలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలలో  రోడ్లు  దెబ్బతిని, రోడ్లు అన్ని జలమయం అయిన ప్రాంతాలను గుర్తించి ,రోడ్డు డైవర్షన్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు మీడియా ద్వారా లోకల్ చానల్స్ లో స్క్రోలింగ్ ఇవ్వాలని కలెక్టర్ అన్నారు.  ప్రమాదం అవకాశాలు ఉన్నా ప్రాంతాలలో ప్రమాద హెచ్చరికలు, కాషన్ బోర్డ్స్ లు ఏర్పాటు చేయవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.