లైంగిక వేధింపుల కేసులో జెడిఎస్ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణ అజ్ఞాతం వీడేందుకు సిద్దమయ్యారు. కేసు విచా రణ సమయంలో ప్రత్యేక దర్యా ప్తు బృందం విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో లుక్ అవుట్ నోటీసులు జారీ అవ్వడం సంచలనంగా మారింది. అయితే గత కొంతకాలం ఆచూకీ లేక పోవడంతో విమ ర్శలు ఎదుర్కొన్న రేవణ్ణ ఎట్టకేలకు బెంగుళూరుకు రావా లని నిర్ణంచుకోవడంతో అధికారు లు తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట హాజరుకావాలని, లేకుంటే సిట్ ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉం టుందని తెలుస్తోంది. విచారణకు హాజరయ్యేందుకు ఏడురోజుల సమ యం ఇవ్వాలన్న రేవణ్ణ అభ్యర్థనను సిట్ తిరస్కరించింది.హెచ్డి రేవణ్ణ, ఆయన కుమారు డు ప్రజ్వల్ రేవణ్ణలు విచారణకు హాజరుకావాల్సిం దేనని, లేకుంటే అరెస్ట్ తప్పేలా కనిపించడం లేదు.
లోక్సభ ఎన్నికల సమయంలో మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మన వడు, జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలల వీడియోల వ్యవహారం దేశంలో పెను దు మారానికి కారణ మైంది. రాసలీలల వీడియోలు బయటికి రాగానే విదేశానికి పారిపోయిన ప్రజ్వల్ రేవణ్ణ బెంగుళూరుకు రావ డంతో ఊహించని పరిణామాలు తలేత్తే అవకాశాలు ఉన్నాయి