ఎన్డీఏ కూటమికి తొలి విజయం దక్కింది. గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి పోటీచేస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా గెలుపొందారు. తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్‌భాయ్‌పై 3,96,512 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో అమిత్ షాకు 5,06,731 ఓట్లు రాగా, రమణ్‌భాయ్‌కి 1,10,219 ఓట్లు పోలయ్యాయి. ఇక బహుజన్ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన మహమ్మద్ అనీశ్ దేశాయ్‌కి డిపాజిట్ దక్కలేదు. ఆయనకు 3,244 ఓట్లు మాత్రమే వచ్చాయి.కాగా, కేంద్రంలో ఎన్డీయే మరోసారి ప్రభుత్వ ఏర్పాటు దిశగా కొనసాగుతున్నది.
ఇప్పటివరకు 297 చోట్ల ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఇండియా బ్లాక్ 225 స్థానాల్లో మెజార్టీలో ఉన్నది. ఇప్పటివరకు ఇరు కూటములు ఒక్కో చోట విజయం సాధించారు. మరో 19 సీట్లలో ఇతరులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.