ఏపీలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాల్లో తొలి రౌండ్ నుంచి టీడీపీ-జనసేన కూటమి తన చాటులోంది. సినీ నటి, నగరి అభ్యర్థి ఆర్కే రోజా సెల్వమణి నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వెనుకంజలో కొనసాగుతున్నారు. రోజాపై నగరి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఓటమి దిశగా పయనిస్తుండటంతో ఫలితాలపై ఆర్కే రోజా ఎక్స్ వేదికగా తన స్పందనను అందరితో షేర్ చేసుకున్నారు. శక్తివంతమైన వ్యక్తి అంటే భయాలే విశ్వాసంగా .. ఎదురుదెబ్బలే పునరాగమనంగా.. మన్నింపులే నిర్ణయాలుగా, తప్పులే పాఠాలుగా నేర్చుకునే వ్యక్తి.. అనే సందేశాన్ని జోడిస్తూ.. ఓ చిన్నారి నుంచి రోజా పువ్వును స్వీకరిస్తున్న సందర్భంలో తీసిన ఫొటోను షేర్ చేశారు.
ఇప్పుడీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.రాష్ట్రవ్యాప్తంగా కూటమిలో 135 (టీడీపీ) స్థానాల్లో, జనసేన 20 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. ఇక వైఎస్సార్సీపీ నుంచి పోటీలో ఉన్న మాజీ మంత్రులంతా వెనుకంజలో కొనసాగుతున్నారు.