ఆంధ్రప్రదేశ్ రాజకీయం

మంత్రులంతా ఓటమి పాలు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో దాదాపు మత్రులుగా పనిచేసిన వైకాపా అభ్యర్థులంతా ఓటమి దిశగా పయనిస్తున్నారు. ఇప్పటి వరకూ వెలువడిన ఓట్ల లెక్కింపు గణాంకాల్లో ఈ మంత్రులంతా వెనుకంజలో ఉండటం కనిపిస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి వేవ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ని మించి కూటమి అభ్యర్థులు లీడ్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ పంధా కొనసాగితే ఈఎన్నికల్లో గత ఎన్నికల్లో వైకాపా సాధించిన 151 స్థానాల మార్క్ ను కూటమి దాటేసేలా కనిపిస్తోంది. ముఖ్యంగా మంత్రుల ఇలాఖాలో ప్రతికూల ఫలితాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. పులివెందులలో సీఎం జగన్, చీపురు పల్లిలో బొత్స సత్యనారాయణ, పుంగనూరులో పెద్దిరెోడ్డి రామచంద్రారెడ్డి, సర్వేపల్లిలో కాకాణి గోవర్థన్ రెడ్డి  మినహా మంత్రులంతా ఓట్ల లెక్కింపులో భారీగా వెనకబడ్డారు. కాకాణి, బొత్స, పెద్దిరెడ్డి సైతం కొన్ని రౌండ్లలో స్వల్ప తేడాతో వెనకంజ వేయడం కనిపిస్తోంది.

రాజమండ్రి రూరల్ నుంచి పోటీ తెదేపా అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన సమీప వైకాపా అభ్యర్థి, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణపై 60 వేట ఓట్ల తేడాతో గెలిచారు.  తాడేపల్లి గూడెంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తన సమీప జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ కంటే 15 వేల ఓట్ల మేర వెేనకంజలో ఉన్నారు. గోపాలపురం నియోజవర్గంలో హోం మంత్రి తానేటి వనిత సమీప తెదేపా అభ్యర్థిా మద్ది పాటి వెంకటరాజు కంటే 7 వేల ఓట్ల  వెనకబడి ఉన్నారు.  గాజువాకలో గుడివాడ అమర్ నాథ్ సమీప తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు కంటే 15 వేల ఓట్ల మేర వెనకబడి ఉన్నారు. అనకాపల్లి ఎంపీగా పోటీ చేసిన బుడి ముత్యాల నాయుడు సమీప భాజపా  అభ్యర్థి సీఎం రమేష్ కంటే 25 వేల ఓట్ల వెనకబడి ఉన్నారు. పెనమ లూరులో జోగి రమేశ్ తన సమీప తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్ కంటే దాదాపు 11 వేల ఓట్ల మేర వెనకబడి ఉన్నారు.   తునిలో మంత్రి దాడిశెట్టి రాజా సమీప తెదేపా అభ్యర్థి యనమల దివ్య కంటే 22 వేల ఓట్లు వెనకంజలో ఉన్నారు.

అమలాపురంలో మంత్రి పినిపే విశ్వరూప్ సమీప తదేపా అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు కంటే 12వేల ఓట్ల వెనకంజలో ఉన్నారు. డోన్లో మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ తెదేపా అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కంటే వెయ్యి  ఓట్లు వెనకపబడ్డారు.  నగరిలో మంత్రి ఆర్ కే రోజా సమీప తెదేపా అభ్యర్థి గాలి భాను ప్రకాశ్ కంటే ఎనిమిది వేల ఓట్లు వెనకబడ్డారు.   సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు సమీప తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ కంటే 13వేల ఓట్ల వెనకంజలో ఉన్నారు. కొండపిలో ఆదిమూలపు సురేష్ తెదేపా అభ్యర్థి డోలా బాల వీరాంజనేయ స్వామి కంటే రెండు వేల ఓట్ల వెనకంజలో ఉన్నారు. సంతనూతల పాడులో మేరుగు నాగార్జున తన సమీప అభ్యర్థి విజయ్ కుమార్ కంటే 15 వేల ఓట్ల వెనకంజలో ఉన్నారు  మంత్రి విడదల రజనీ గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో తన సమీప అభ్యర్థి గల్లా మాధవి కంటూ 5 వేల ఓట్ల వెేనకంజలో ఉన్నారు.  

శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాద్ రావు, పలాసలో సీదిరి అప్పలరాజు, పెనుగొండలో పోటీచేసిన ఉషాశ్రీచరణ్ సైతం వెనకంజలో ఉన్నారు. ఇదిలా ఉంటే వైకాపా ఇలాఖాలో మంత్రి గా పనిచేసి టికెట్ దక్కకపోవడంతో చివర్లో టీడీపీలో చేరి గుంతకల్ టికెట్ పొందిన గుమ్మనూరు జయరాం తన నియోజకవర్గంలో లీడ్ లో కొనసాగుతున్నారు