కీసర హోలిమేరి కాలేజీ వద్ద ఏర్పాటుచేసిన కౌంటింగ్ సెంటర్లో మీడియా పాయింట్ వద్ద ఈటల రాజేందర్ మాట్లాడారు. బీజేపీకి ఓటు వేసిన ప్రతిఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్న. మీ విశ్వాసానికి తగ్గట్టు పని విధానం ఉంటుంది. మాకు రెండు కర్తవ్యాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం కొట్లాడతాం. మోదీ గారి ప్రభుత్వం నుండి రాష్ట్రానికి నిధులు తెస్తాం. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాం. 17 సీట్లలో 8 సీట్లు గెలిచి ఆధిపత్యం కొనసాగిస్తున్నాం. ఇది ప్రజల అశేర్వాదం. దేశంలో 300 సీట్ల పైగా సీట్లతో దేశంలో మూడోసారి మోదీగారు అధికారంలోకి రాబోతున్నారు. స్వేచ్ఛ స్వతంతం – ప్రగతి ఆత్మగౌరవం కోసం బీజేపీకి ఓటు వేశారు. మోదీ ఈ పదేళ్లలో పేదవారికి డబ్బున్న వారికి ఉన్న అంతరాలు తగ్గించారు. యువతకి ఉద్యోగ అవకాశాలు కలిపించారు. మౌలిక వసతులు ఏర్పాటు చేసారు. భారత ఆత్మగౌరవం పెంచారు. మోదీ హయాంలో బాంబుల మోతలు లేవు. నేను మల్కాజగిరి స్థానికుణ్ణి.
నామీద విశ్వాసం ఉంచి గెలిపించారు. ఏ రౌండ్ లో మేజారిటీ తగ్గకుండా ఓట్లు వేశారు. కంటోన్మంట్ రోడ్స్, చెరువుల పునరుద్ధరణ, యువతకు ఉపాధి, పేదలకు ఇళ్ళు, ఇండస్ట్రియల్ కారిడార్, అన్ని నెరవేరుస్తా. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా. నోట్లో నాలుకలా ఉంటా. నాకు సహకరించిన అన్ని సంఘాలకి కృతజ్ఞతలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో ఉండి నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. నాకు ఓటు వేస్తే సేఫ్ గార్డ్ ఉంటుంది అని, ప్రగతికి పునాది పడుతుంది అని ఓట్లు వేశారు. అందరికే ధన్యవాదాలు. అందరివాడిలా ఉంటా.. పొత్తుల సద్దిలా ఉంటా అని హామీ ఇస్తున్నా అని ఈటల అన్నారు. పది సంవత్సరాల తరువాత కూడా దేశ ప్రజలు మోడీ ని కోరుకుంటున్నారు అంటేనే వారిపట్ల ఉన్న అభిమానం అర్థం చేసుకోవచ్చు అని అన్నారు.