జూన్ 9న సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనుండటం ఇది నాలుగోసారి కావడం విశేషం. అమరావతిలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుంది. టీడీపీ చరిత్రలోనే అతి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. 161 సీట్లతో అధికారాన్ని చేజించుక్కించుకోనుంది. తుది ఫలితాలు వెలువడే సమయానికి సంఖ్య అటు ఇటు అవ్వొచ్చేమే కానీ అధికారాన్ని చేజిక్కించుకోవడమైతే ఫిక్స్ అయిపోయింది. టీడీపీ పోటీ చేసిన స్థానాల్లో 10 మినహా మిగిలిన అన్ని చోట్ల ముందంజలో ఉంది. అటు లోక్‌సభ విషయంలోనూ దాదాపు 22 స్థానాల్లో ఎన్డీఏ కూటమి హవా కొనసాగిస్తోంది.మరోవైపు వైసీపీ ప్రతిపక్ష హోదాను సైతం దక్కించుకునే పరిస్థితి కనిపించడం లేదు. మరి తుది ఫలితాలు వెలువడే సమయానికి ఏమైనా దక్కించుకుంటుందేమో చూడాలి. వైసీపీ ప్రతిపక్ష హోదా దక్కించుకోవాలంటే 18 స్థానాల్లో విజయం సాధించాలి.
కానీ ఇప్పుడు వైసీపీ కేవలం 14 స్థానాల్లోనే ముందంజలో ఉంది. ఇక ఆసక్తికర విషయం ఏంటంటే.. వైసీపీ గెలుస్తుందనే ధీమాతో జగన్ ముందుగానే తన ప్రమాణ స్వీకార తేదీని ఫిక్స్ చేసుకున్నారు. 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు చెప్పేశారు. ఇప్పుడు అదే తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వైసీపీకి ఇది నిజంగా ఊహించని దెబ్బే. విజయం తధ్యమంటూ నానా యాగీ చేసిన వైసీపీ ఇంత ఘోర పరాజయాన్ని కల్లో కూడా ఊహించి ఉండదు.