తెలంగాణ ముఖ్యాంశాలు

కేటీఆర్ పుట్టిన రోజు..మొక్క‌లు నాటిన స్పీక‌ర్

నేడు మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు ఈ సంద‌ర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వ‌హిస్తున్న ముక్కోటి వృక్షార్చ‌న‌లో తెలంగాణ శాస‌న‌స‌భ స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లి ప్రొటెం చైర్మ‌న్ భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో వీరు మొక్క‌లు నాటారు. పోచారం మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన త్రాగునీరు, సేంద్రియంగా పండించిన సహజ ఆహారం అవసరం. ఈ మూడు రకాల అవసరాలను ప్రజలకు అందించడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. హరితహారం కార్యక్రమం ద్వారా 230 కోట్ల మొక్కలు నాటుతున్నారు. మిషన్ భగీరధ పథకం ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందుతుంది. సహజమైన సేంద్రియ ఆహార ధాన్యాలు సాగుచేయడానికి ప్రోత్సహిస్తున్నారు అని స్పీక‌ర్ పేర్కొన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంక‌టేశ్‌, ఎమ్మెల్సీలు ఎమ్మెస్ ప్ర‌భాక‌ర్ రావు, భానుప్ర‌సాద్ రావు, కూచికుళ్ల దామోద‌ర్ రెడ్డి, వాణీదేవీ, బుగ్గారం దయానంద్, ఫారుక్ హుస్సేన్, విజీ గౌడ్, లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్ట‌ర్ వి నరసింహా చార్యులు పాల్గొన్నారు.