భవిష్యత్తు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నానని ట్వీట్
సినీనటుడు సోనూసూద్ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనను సూపర్ స్టార్‌గా అభివర్ణించారు. గతంలో కేటీఆర్ తో తీసుకున్న ఫొటోను ఈ సందర్భంగా సోనూసూద్ పోస్ట్ చేశారు. కేటీఆర్, సోనూసూద్ ఆలింగనం చేసుకుని ఈ ఫొటోలో కనపడుతున్నారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు కేటీఆర్ గారు.. భవిష్యత్తు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీ సానుకూల దృక్పథం, విజన్ లక్షలాది మందికి మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయి. మీరు నాకు మాత్రమే సూపర్ స్టార్ కాదు రాష్ట్రం మొత్తానికి సూపర్ స్టార్. మరోసారి మీకు గట్టిగా హగ్ ఇవ్వాలని ఆత్రుతతో ఉన్నాను’ అని సోనూసూద్ పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన కేటీఆర్.. సోనూసూద్‌కు కృతజ్ఞతలు చెబుతూ రిప్లై ఇచ్చారు. కాగా, పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న కేటీఆర్‌కు పలువురు రాజకీయ, సినీ రంగాల వారు ట్వీట్లు చేస్తున్నారు. పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ ప్రారంభించిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పలువురు నేతలు వికలాంగులకు స్కూటీలు అందిస్తున్నారు. అలాగే, ముక్కోటి వృక్షార్చనలో పాల్గొంటున్నారు.