తెలంగాణ ముఖ్యాంశాలు

భారీ వ‌ర‌ద‌.. భ‌ద్రాచ‌లం వ‌ద్ద మొద‌టి ప్ర‌మాద హెచ్చ‌రిక

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో గోదావ‌రిలో వ‌ర‌ద ఉధృతి పెరిగింది. దీంతో భ‌ద్రాచ‌లం వ‌ద్ద 44.7 అడుగుల మేర గోదావ‌రి ప్ర‌వాహం కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో భ‌ద్రాచ‌లం వ‌ద్ద అధికారులు మొద‌టి ప్ర‌మాద హెచ్చ‌రిక జారీ చేశారు. గోదావ‌రిలో సాయంత్రం వ‌ర‌కు వ‌ర‌ద ఉధృతి మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని అధికారులు పేర్కొన్నారు. గోదావ‌రి నీటిమ‌ట్టం 48 అడుగులు దాటితే రెండో ప్ర‌మాద హెచ్చ‌రిక జారీ చేయ‌నున్నారు.