తెలంగాణ రాజకీయం

రాజీనామా రేడీ చేసుకో హరీష్ రావూ

బీఆర్ఎస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ ,కొండలు, గుట్టలకు రైతు బంధు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి ఇవ్వదు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సోమవారం అయన అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడారు. రుణమాఫీ ఆగస్ట్ 15 లోపు చేసి తీరుతాం . హరీష్ రావు స్పీకర్ పార్మేట్లో రాజీనామా లేఖ ను సిద్ధం చేసుకో. హరీష్ రావు చేసిన ఛాలెంజ్ కు కట్టుబడి ఉండాలి. పక్కకు పారి పోకుండా మానసికంగా సిద్ధంగా ఉండాలి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమం కోసం పాటు పడే వ్యక్తి. ఇప్పటి వరకు 68మంది లక్షల మంది రైతులకు 7వేల 6వందల 25కోట్లు రైతు బంధు ప్రభుత్వం ఇచ్చింది. 2022-2023 లో వాళ్ళు ఇచ్చిన తేదీలకంటే ముందు కాంగ్రెస్  ప్రభుత్వం అకౌంట్లో వేసింది. నకిలీ విత్తనాలు అమ్మితే పీడి యాక్ట్ తప్పదు. రైతు భరోసా కు విధి విధానాలను రూపొందిస్తున్నాం. ఆలస్యం కాకుండా అనుకున్న టైం లో రైతు భరోసా ఇస్తాం. ఆరు గ్యారంటీల అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. హరీష్ రావు తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుండని అన్నారు.