ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

జాడ లేని వాన

 ఏడాది డేంజర్ బెల్స్ మోగినట్లే కనిపిస్తున్నాయి. ఇంతవరకు వాన జాడలేదు. ఖరీఫ్ ప్రారంభమవుతున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు పడడం లేదు. దీంతో రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు మూడు రోజులు ముందుగానే ప్రవేశించాయి. ఈనెల 2న వాటి రాక ప్రారంభమైంది. గురువారం నాటికి రాష్ట్రమంతటా విస్తరించాయి. కానీ ఉత్తరాంధ్ర పై అధిక పీడన ద్రోణి ప్రభావం చూపడంతో స్తబ్దుగా ఉండిపోయాయి. రాష్ట్రమంతటా నైరుతి వ్యాపించినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి భానుడు సెగలు కక్కుతున్నాడు.రాష్ట్రవ్యాప్తంగా ఒకటి రెండు ప్రాంతాలు తప్ప వర్షాలు జాడలేదు. చెప్పుకోదగ్గ వానలు పడడం లేదు. పైగా రాష్ట్ర మంత్రుల నిప్పుల కుంపటిని తలపిస్తోంది. వేడి, ఒక్క పోతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మే నెలలో ఉన్నట్లుగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరగడంతో బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.

మరో నాలుగు ఐదు రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్పపీడనం కానీ.. ఆవర్తనం కానీ ఏర్పడితేనే వర్షాలు కురిసి.. వాతావరణం చల్లబడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఖరీఫ్ సీజన్ కు సంబంధించి అదును దాటుతుండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఇంకా నారుమడులు కూడా సిద్ధం కాలేదు.ప్రస్తుతం కర్ణాటక, కేరళ తీరాల మీదుగా ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మాస్టరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. పిడుగులతోపాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా స్పష్టం చేసింది. శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణాజిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.