తెలంగాణ రాజకీయం

ముందుకు సాగని మహాలక్ష్మీ…

 కాంగ్రెస్ ప్రభుత్వ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ‘మహాలక్ష్మి’ పథకం ఒకటి. ఈ పథకంలో భాగంగా తెలంగాణలోని ప్రతీ మహిళకు రూ.2,500 ఆర్థిక సాయం చేయడం. గత ప్రభుత్వం వృద్ధులకు ఆసరా పింఛన్లు, బీడీ కార్మికులకు సాయం చేసింది. అలాగే చదువుకొని ఉద్యోగాలు చేయని వారికి నిరుద్యోగ భృతి అందిస్తామని పేర్కొంది. అయితే ఈ పథకం ప్రారంభం కాకపోవడంతో దీని స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో నిరుద్యోగ మహిళలకు రూ.2,500 సాయం చేస్తానని తెలిపింది. దీంతో చాలా మంది మహిళలు ఇది అందరికీ వర్తిస్తుందని అనుకున్నారు. కానీ ఈ పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం షాకింగ్ న్యూస్ తెలిపింది. అదేంటంటే?తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారెంటీల పథకాలపై దృష్టి పెట్టింది. వీటిలో కొన్ని ఇప్పటికే అమలు చేసింది. ఇటీవల రుణ మాఫీ కోసం కసరత్తు పూర్తి చేస్తారు.

ఆగస్టు 15 నాటికి రైతులకు రూ.2 లక్షల వకు రుణమాఫీ చేయనున్నారు. దీని తరువాత కాంగ్రెస్ ప్రకటించిన మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు రూ.2,500 సాయం గురించే ఆలోచిస్తారన్న చర్చ ప్రారంభమైంది. అయితే ఇటీవల జరిగిన సమావేశాలు, విధి విధానాలు చూస్తే ఈ పథకం ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం రైతు రుణ మాఫీపై తీవ్రంగా కృషి చేస్తున్నారు. దీని కోసం రూ.40 వేల కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ పథకం తరువాత కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది. అయితే గతంలో లాగా రేషన్ కార్డులను అనర్హులకు కాకుండా అసవరమైన వారికే ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా ముందుగా సర్వే చేసిన తరువాత కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించనున్నారు. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తియిన తరువాతే మహాలక్ష్మి (రూ.2,500) స్కీంను ప్రారంభించే అవకాశం ఉంది.

అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మహాలక్ష్మి పథకం గురించి ఓ న్యూస్ మహిళలకు షాక్ ఇచ్చినట్లయింది. రూ.2,500 సాయం మొత్తాన్ని అందరికీ కాకుండా కొందరికీ మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆసరా పింఛన్లు, బీడీ కార్మికులకు కాకుండా కొత్త వారికి ఇవ్వాలని అనుకుంటోంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా ఇందులో మినహాయించే అవకాశం ఉంది. అంటే ఈ ప్రక్షాళన తరువాత ఎలాంటి ఆదాయం వచ్చే పనులు చేయడంగా గృహిణులుగా ఉన్న వారికి మాత్రమే ఈ సాయం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.