రాజకీయాల్లో ఆ మంత్రి కీలకంగా మారారు. ఎక్కడ ఏ జాయినింగ్ జరిగిన ఆ మంత్రి కనుసన్నల్లోనే అది పూర్తి అవుతుంది. జాయిన్ చేసుకునేది సీఎం అయినా దాని వెనుక ఉండేది మాత్రం ఖమ్మం జిల్లా మంత్రి పోంగులేటి అనే వార్త జోరుగా ప్రచారం జరుగుతోంది. అవును ఈ ప్రచారానికి రోజు రోజుకు బలం చేకూరుతూనే ఉంది. ఎందుకంటే ఆ మంత్రి ఇంప్లూయిన్స్ ఆ రేంజ్లో ఉంది. ఆయన లేకుండా ఒక్క జాయినింగ్ కూడా జరగడం లేదంటే మంత్రి ఏంత పవర్ పుల్ అనేది ఆర్థం చేసుకోవచ్చు. ఇక ఈ మధ్య తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ అపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. దీని కోసం జాగ్రత్తగా ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లోకి లాగుతున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకిదిగి కండువాలు కూడా కప్పేస్తున్నారు. కానీ ఈ చేరికల వెనుక అపరేషన్ చేస్తున్నది మాత్రం మంత్రి పోంగులేటి అనే టాక్ ఇప్పుడు పార్టీలో, ప్రభుత్వంలో జోరుగా నడుస్తుంది. దీనికి బలం చేకూరుస్తూనే తాజాగా మాజీ స్పీకర్ పోచారం జాయినింగ్‌లో కూడా పోంగులేటి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.
సిఎంతో పాటుగా పోచారం ఇంటికి వెళ్లిన పోంగులేటి.. కండువా కప్పి జాయిన్ చేసుకునే వరకు ఎవరికీ అనుమానం రాలేదు. ఆయన చేరికతో బిఆర్ఎస్ షాక్‌కు గురైంది. ఆ షాక్‌లో నుండి తేరుకోక ముందే ఆదివారం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ను రాత్రి 10 గంటల సమయంలో పోంగులేటి సీఎం ఇంటికి తీసుకెళ్లి కాంగ్రెస్ కండువా కప్పించారు.బిఆర్ఎస్కు అత్యంత విధేయుడు అయిన సంజయ్ అపరేషన్‌ను అసలు పార్టీలో ఎవరికీ డౌట్ రాకుండా ఫినిష్ చేసారు పోంగులేటి. ఇక ఈ రెండు సంఘటనలు ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్‌లో హట్ టాఫిక్‌గా మారాయి. పోంగులేటి సంజయ్ వ్యవహరంలో జీవన్ రెడ్డి హర్ట్ అయినా కూడ లైట్ తీసుకోని మరి సంజయ్‌ని తన చాంబర్లోకి పిలిపించుకోని సపోర్ట్ చేశారట మంత్రి పోంగులేటి. ఇక ఇప్పటికే బిఆర్ఎస్ నుండి జాయిన్ అవ్వాలి అనుకున్న పలువురు ఎమ్మెల్యేలు కూడా వయా పోంగులేటి నుండి పోవడమే బెటర్ అని ఫీల్ అవుతున్నారట. జిల్లాలో ఎవరు ఫీల్ అయినా యూ డోంట్ కేర్ ఐ విల్ దేర్ అంటున్నారట మంత్రి పోంగులేటి.
దీంతో అధికార పార్టీ తీర్థం పుచ్చుకుందాం అనుకుంటున్న ఎమ్మెల్యేలకు ఆశాదీపం అవుతున్నారట ఆయన.ఇక ఇప్పుడు జాయినింగ్ ఏదైనా వయా పోంగులేటి అయితేనే బెటర్ అనుకుంటున్నారట పక్కపార్టీ ఎమ్మెల్యేలు. ఇదిలా ఉంటే జిల్లాలలో పొంగులేటిపై కోపంగా ఉన్నారట సీనియర్ మంత్రులు, నేతలు. తమతో సంప్రదింపులు జరపకుండా.. చర్చించకుండా ఎలా జాయిన్ చేసుకుంటారు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ప్రస్తుతం ఇదే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.