తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి బీటెక్, బీఈ కోర్సుల్లో ప్రవేశాలకు రేపట్నుంచి జరగవల్సిన ఈఏపీసెట్ కౌన్సెలింగ్ వాయిదా పడింది. ఈ మేరకు ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశాల కౌల్సింగ్ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. మొత్తం మూడు విడతలుగా జరగాల్సిన ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ జూన్ 27 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా.. అది వాయిదా పడింది. ఈ సందర్భంగా కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం తొలివిడత ప్రవేశాల ప్రక్రియ జులై 4 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ ఈఏపీసెట్ 2024 కొత్త షెడ్యూల్ ఇదే..
జులై 4 నుంచి ఇంజినీరింగ్ తొలివిడత రిజిస్ట్రేషన్లు ప్రారంభం
జులై 6 నుంచి 13 వరకు తొలి విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్
జులై 8 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం
జులై 19న తొలివిడత సీట్ల కేటాయింపు
జులై 26 నుంచి రెండో విడత కౌన్సిలింగ్జు
జులై 27న సర్టిఫికెట్ వెరిఫికేషన్జు
జులై 27, 28 తేదీల్లో రెండో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం
జులై 31న రెండో విడత సీట్ల కేటాయింపు
ఆగస్టు 8 నుంచి మూడో విడత కౌన్సిలింగ్ ప్రక్రియ
ఆగస్టు 9న సర్టిఫికెట్ వెరిఫికేషన్ఆ
గస్టు 9,10 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం
ఆగస్టు 13న 3వ విడత సీట్ల కేటాయింపు
ఆగస్టు 21 నుంచి కన్వినర్ కోట ఇంటర్నల్ స్లైడింగ్ కి అవకాశం
కాగా ఈ ఏడాది జరిగిన టీఎస్ ఈఏపీసెట్ పరీక్షకు 2,54,814 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంజనీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు.. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో 91,633 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో అగ్రికల్చర్, ఫార్మసీలో 89 శాతం, ఇంజినీరింగ్ విభాగంలో 74.98 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. మరో రెండు రోజుల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందనంగా ఇంతలో కొన్ని కారణాల రిత్య కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.