ఆంధ్రప్రదేశ్ రాజకీయం

ట్విట్టర్ వార్…

పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నట్టు ఉంది వైసీపీ తీరు అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు లేకుండా కట్టిన పార్టీ ఆఫీసులకి, అనుమతులతో కట్టిన రాష్ట్ర పార్టీ ఆపీసుకు తేడాలేదా అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మంత్రి నారా లోకేష్‌ పై వైసీపీ కీలక నేత, మాజీమంత్రి పేర్ని నాని ట్విట్టర్ వేదికగా స్పందించారు.‘నారా లోకేష్‌ నువ్వు పిల్లాడిగా ఉన్నప్పుడు మీ నాన్న హైదారాబాద్ లో కట్టించిన పార్టీ ఆఫీస్ ఏంటి ఇది పూరిపాక, రేకుల షెడ్డా లేదంటే ఒకే గది ఉన్న స్లాబా.. దీని చరిత్ర ఏంటి? ఈ పార్టీ ఆఫీస్ స్థలాన్ని ట్రస్ట్ కి బదిలీ చేసుకున్నారు రెగ్యులరైజ్ కూడా చేసుకున్నారు.. 2019 ఎన్నికలకు వెళ్ళే నెల ముందు జనవరిలో కూడా 3 ఆఫీసులకి స్థలం లీజుకి తీసుకున్నారు.’ అంటూ టీడీపీ ఆపీస్ ఫోటో షేర్ చేశారు.పేర్ని నాని ట్టీట్‌కు టీడీపీ ఘాటుగా స్పంధించింది. ‘

వైఎస్ జగన్ నువ్వు పదో తరగతిలో లాగులు వేసుకునే టైంలో, ప్రశ్నాపత్రాలు దొంగతనం చేసి దొరికిపోయావు. నీ స్నేహితులు చక్కగా చదువుకుని బాగుపడ్డారు. నువ్వు మాత్రం ఘరానా దొంగవి అయ్యావు. నీకు, నీ స్నేహితులకు ఎంత తేడా ఉందో, మేము అనుమతులతో కట్టిన రాష్ట్ర పార్టీ ఆఫీసుకు, నువ్వు అనుమతులు లేకుండా, అక్రమంగా, కబ్జా చేసి, ప్రజల డబ్బుతో, 26 జిల్లాల్లో కట్టిన 26 ప్యాలెస్‌లకు అంత తేడా ఉంది.’ అంటూ టీడీపీ మండిపడింది. కాగా ఈ పోస్టులు చూసిన నెటిజన్స్ వైసీపీపై మండిపడుతున్నారు.పేర్ని నాని పోస్టుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. టీడీపీ అవినీతి అక్రమాలకు పాల్పడిందని ఇప్పుడు గగ్గోలు పెడుతున్న వైసీపీ నేతలు, అధినేత అధికారంలో ఉండగా ఎందుకు నోరు మెదపలేదు..? అనుమతులతో కట్టిన, ప్రజలకు ఉపయోగకరమైన ప్రజా వేదికను కూల్చినప్పుడు, అనుమతులు లేని పార్టీ ఆపీసుపై ఎందుకు చర్యలు తీసుకోలేదు..? అని ప్రశ్నిస్తున్నారు.

అలానే నాడు మాట్లాడకుండా మౌనంగా ఉన్న మీరు నేడు మాట్లాడుతున్నారంటే.. టీడీపీపై వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని తమకు అర్ధం అవుతుందని, కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబుపై బురద జల్లేందుకు మీరు చేస్తున్న ప్రయత్నం వర్ధ్యం అని వైసీపీని ప్రజలు నమ్మడంలేదని నెటిజన్స్ తేల్చి చెప్పారు.