టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టాన్ని తక్షణం అంచనా వేయించాలన్నారు. పంటల బీమా అమలు కాకపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు 15 వేల చొప్పున పరిహారం చెల్లించాలని లేఖలో రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కొత్తగా పంటలు వేసుకోవడానికి విత్తనాలు, ఎరువులు, ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని, తక్షణం రూ.లక్ష రైతు రుణమాఫీ నిధులు విడుదల చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.
కెసిఆర్ కు బహిరంగ లేఖ రాసిన రేవంత్‌రెడ్డి