అధికారులకు సిబ్బందికి ఎలాంటి సమస్యలు తలెత్తినా ఎల్లప్పుడూ అండగా ఉంటాం. పదవి విరమణ చేసిన పోలీసు అధికారులకు కమిషనర్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోల కార్యక్రమం. సిద్దిపేట్ కమీషనరేట్ పరిధిలో సుదీర్ఘంగా విధులు నిర్వహిస్తూ, పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులు. మందాడి వెంకట సురేందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పోలీస్ కంట్రోల్ రూమ్ సిద్దిపేట, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ నుండి ఇన్స్పెక్టర్ వరకు అంచలంచలుగా పదోన్నతి పొంది డిపార్ట్మెంట్లో 41 సంవత్సరాల సర్వేస్ పూర్తి చేసినారు. గడప సూర్యనారాయణ, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, సబ్ ఇన్స్పెక్టర్ గా అంచలంచలుగా పదోన్నతి పొందారు. డిపార్ట్మెంట్లో 40 సంవత్సరాల సర్వేస్ పూర్తి చేసినారు. గంట భూమయ్య, హెడ్ కానిస్టేబుల్, హుస్నాబాద్ పోలీస్ స్టేషన్, కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ పదవున్నది పొంది డిపార్ట్మెంట్లో 35 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసినారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారులను అభినందించి సన్మాన పత్రం మెమొంటో అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ. పోలీస్ డిపార్ట్మెంట్లో సుదీర్ఘంగా 40 సంవత్సరాల సర్వస్ పూర్తి చేసుకుని పదవీ విరమణ చేయడం అభినందనీయమన్నారు ఉద్యోగనిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలను పొందినారని శుభాకాంక్షలు తెలియజేస్తు రిటైర్డ్ మెంట్ బెనిఫిట్ పత్రాలు అందచేశారు. సిద్దిపేట పోలీస్ విభాగంలో సుధీర్ఘకాంగా విధులు నిర్వహించి పదవీవిరమణ చేసిన సిబ్బంది సేవను మరువమని, పదవీవిరమణ చేసిన మీరు పోలీస్ కుటుంబంలో ఎలాంటి సమస్య వచ్చిన తనను సంప్రదించ వచ్చని తెలిపారు. పోలీసు రిటైర్ మెంట్ కేవలం తన వృత్తికే, కాని తన వ్యక్తిత్వానికి కాదు అని కొనియాడారు. విధి నిర్వహణలో పగలనక, రాత్రనక, పండగల సమయంలో భార్యా, పిల్లలకు దూరంగా ఉండి విధులు నిర్వహించినారు.
పదవి విరమణ చేసిన పోలీసులు ఇకపై కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావిజీవితం ఆయు రారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షినారు. అత్యవసరం అయినప్పుడు రిటైర్డ్ అయిన పోలీస్ అధికారుల సేవలు వినియోగించుకుంటారని తెలిపారు. పదవీవిరమణ చేసిన పోలీస్ అధికారుల విధి నిర్వహణలో ఎదురైయిన అనుభవాను పోలీస్ కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ యస్. మల్లారెడ్డి, తెలంగాణ రాష్ట్ర పోలీసు ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి, మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.