జాతీయం ముఖ్యాంశాలు

దేశంలో 30వేలకు దిగువకు కొత్త కేసులు

కొత్తగా 29,689 క‌రోనా కేసులు
మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,14,40,951
మృతుల సంఖ్య మొత్తం 4,21,382

దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో 29,689 కొత్త కరోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,14,40,951కు చేరింది. అలాగే, నిన్న 42,363 మంది కోలుకున్నారు.

మరణాల విషయానికొస్తే… నిన్న 415 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,21,382కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,06,21,469 మంది కోలుకున్నారు. 3,98,100 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 44,19,12,395 వ్యాక్సిన్ డోసులు వేశారు.