పార్లమెంట్ వర్షాకాల ఉభయ సభ సమావేశాలు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో విపక్షాలు పెగాసస్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి. పెగాసస్ స్పైవేర్ ప్రాజెక్ట్ అంశంపై చర్చకు కాంగ్రెస్ ఎంపీలు మనీష్ తివారి,మాణిక్యం ఠాగూర్ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు. అస్సాం-మిజోరాం సరిహద్దు ఘర్షణపై చర్చకు లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ వాయిదా తీర్మానం ఇచ్చారు. ఉభయసభల్లో పెగాసస్ స్పైవేర్ ప్రాజెక్ట్ అంశంపై విపక్షాల ఆందోళన కొనసాగనుంది.
అదే విధంగా పోలవరంపై లోక్‌సభలో వైస్సార్సీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. పోలవరం సవరించిన అంచనాలు ఆమోదించాలని నోటీసు ఇచ్చింది. లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసును వైస్సార్సీపీ ఎంపీ వంగా గీత ఇచ్చారు. మంగళవారం కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో పెగాసస్ అంశంపై విపక్షాల నిరసనలు కొనసాగనున్నాయి. దింతో ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.
కాగా, రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపుపై రాజ్యసభ హర్షం వ్యక్తం చేసింది.