తెలంగాణ రాజకీయం

స్పీకర్ టైం ఇచ్చారు..అందుబాటులో రాలేదు

స్పీకర్ ను కలవడానికి అసెంబ్లీకి వచ్చాము. స్పీకరు అపాయింట్ మెంట్ తీసుకునే వచ్చాము. ఎందుకనో స్పీకరు మాకు టైం యిచ్చి అందుబాటులోకి రాలేదని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. మా నియోజక వర్గాల్లో ప్రోటో కాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నేతల పెత్తనం నడుస్తోంది. ప్రొటో కాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారుల పై ప్రివిలేజి మోషన్ ఇవ్వడానికి స్పీకర్ ను కలవాలనుకున్నాం. స్పీకర్ మళ్ళీ ఎపుడు టైమ్ ఇస్తే అపుడు కలిసి ప్రివిలేజి మోషన్ ఇస్తామని అన్నారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ స్పీకర్ మాకు ఉదయం 11 గంటలకు టైం ఇచ్చారు. ఒంటి గంట దాకా స్పీకర్ కోసం ఎదురు చూశాo. ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పీకర్ అందుబాటు లోకి రాలేదు. కరీంనగర్ జిల్లాల్లో అధికారులు యథేచ్ఛగా ప్రోటో కాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. నేను విద్యా శాఖ పై రివ్యూ మీటింగ్ పెడితే నా పై క్రిమినల్ కేసు పెట్టారు. ప్రజల తరపున పోరాడటం నేను చేసిన తప్పా. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. .చట్టం ముందు అందరూ సమానమే.  
కోర్టు మొట్టి కాయలు వేసినా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది రావడం లేదు. అధికారుల తీరు వల్ల కల్యాణ లక్ష్మి చెక్కులు బౌన్స్ అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రోటో కాల్ ఉల్లంఘనలపై స్పందించాలి. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఎక్కడ పోయాయి. నా మీద కేసులు పెడితే భయపడే వాడిని కాదు. నేను జైలుకు పోవడానికి కూడా సిద్దమే. సీఎం కాన్వాయ్ కు కూడా అడ్డం పడతా. ఖచ్చితంగా  ప్రివిలెజి మోషన్ ప్రవేశ పెడతానని అన్నారు.
ఎమ్మెల్యే డాక్టర్ కె .సంజయ్ మాట్లాడుతూ విప్ ఆది శ్రీనివాస్ సీఎం కేసీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నా . కేసీఆర్ ను తిడితే గొప్ప నాయకుడు కాలేవు ఆది శ్రీనివాస్. అధికారం ఉందని విర్ర వీగొద్దు. కేసీఆర్ ఉద్యమం చేసినపుడు ఆది శ్రీనివాస్ ఎక్కడున్నారు. కేసీఆర్ ను తిట్టి రేవంత్ మెప్పు పొందలేరు. వరద కాలువ సమస్యలు ఉన్నాయి..వాటి గురించి ముందు పట్టించుకోండని అన్నారు.