తెలంగాణ

66 సెల్ ఫోన్ల రికవరీ

గత కొన్ని రోజుల నుండి పడిపోయిన దొంగలించబడిన 66 ఫోన్లను రికవరీ చేసి సంబంధిత బాధితులకు  కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ అనురాధ  చేతుల మీదుగా అందజేయడం జరిగింది.సెల్ ఫోన్ ఎక్కడైనా పడిపోయిన, ఎవ్వరైనా దొంగలించకపోయినా వెంటనే సీఈఐఆర్, డాటా నమోదు చేయాలి ఫోన్ రికవరీ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 20-ఏప్రిల్- 2023 నుండి 920 సెల్ ఫోన్లు సిఈఐఆర్ టెక్నాలజీ ద్వారా గుర్తించి స్వాధీనం చేసుకుని సంబంధిత బాధితులకు అప్పగించడం జరిగింది.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ. ఫోన్ దొరికిన బాధితులు  మీ బంధువులలో, మీ గ్రామాలలో  మీ స్నేహితులలో  ఎవరిదైనా ఫోన్ దొంగతనం జరిగిన ఎక్కడైనా పడిపోయిన  వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలి అనే విషయం పై  వారందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. వరకు జిల్లాలో సీఈఐఆర్ పోర్టల్ 2560 మంది సెల్ఫోన్ పోయినట్లు నమోదు చేసుకున్నారు.

అందులో నుండి 920 సెల్ ఫోన్లు రికవరీ చేసి  సంబంధిత బాధితులకు అప్పగించడం జరిగింది. మిగతా ఫోన్లు కూడా త్వరలో ట్రేస్ ఔట్ చేసి సంబంధిత బాధితులకు అప్పగించడం జరుగుతుంది.సెల్ఫోన్ పోయిందా.. అయితే టెన్షన్ పడకండి. వెంటనే సీఈఐఆర్ లాగిన్ అయి వివరాలు నమోదు చేసుకుంటే తొందర్లోనే ఫోన్ ఎక్కడుందో కనిపెట్టొచ్చని సిద్దిపేట పోలీస్ కమిషనర్ తెలిపారు. ప్రస్తుత రోజుల్లో చిన్నవాళ్ల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరి జీవితంలో సెల్ఫోన్ ఒక భాగమైపోయింది. ఒక్కోసారి ఫోన్ కనిపించకపోయినా. ఎక్కడైనా పోగొట్టుకున్నా. ఎవరైనా దొంగిలించినా ఆ బాధ వర్ణణాతీతం. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక వెబ్ సైటను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే సీఈఐఆర్, సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్,  సెల్ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ వెబ్సైట్ లో పూర్తి వివరాలు నమోదు చేస్తే వీలైనంత తొందరగా దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  కమిషనర్  తెలిపారు.
సీఈఐఆర్ లో ఎలా నమోదు చేసుకోవాలి.
కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ఈ సీఈఐఆర్ అనే పోర్టల్ ద్వారా సెల్ఫోన్ పోయినా, దొంగతనానికి గురైనా వెతికి పట్టుకునేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సెల్ఫోన్ పోయిన వ్యక్తి ముందుగా సంబంధిత పోలీస్ స్టేషన్ లో ముందుగా ఫిర్యాదు చేయాలి, లేదా మీసేవ కేంద్రానికి వెళ్లి www.ceir.gov.in అనే వెబ్సైట్లో లాగిన్ కావాలి. అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాప్ట్ , స్టోలెన్ అనే లింకై క్లిక్ చేసి, సెల్ఫోన్ నెంబర్, ఐఎంఈఐ నెంబర్, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లు అప్లోడ్ చేయాలి. దీంతో పాటు ఏరోజు, ఎక్కడ పోయింది. రాష్ట్రం, జిల్లా, పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి. చివరిగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు
, ఈమెయిల్ ఐడీ, ఓటీపీ కోసం మరో సెల్ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇదంతా. పూర్తయిన తరువాత ఒక ఐడీ నెంబర్ వస్తుంది. తద్వారా సంబంధిత ఐడీ ఫోన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఏ కంపెనీ మొబైల్ అయినా సీఈఐఆర్ విధానం 24 గంటల్లోపు ఫోన్ పని చేయకుండా చేస్తుంది. సెల్ఫోన్ దొరికిన తర్వాత వినియోగదారుడు అదే వెబ్సైట్లోకి వెళ్లి అక్ ఫౌండ్ మొబైల్ అనే లింక్ పై క్లిక్ చేసి. ఐడీ నమోదు చేయగానే ఫోన్ అన్ బ్లాక్ అవుతుందని పోలీస్ కమిషనర్  తెలిపారు.
సీఈఐఆర్ వెబ్సైట్ పై అవగాహన కార్యక్రమాలు
సీఈఐఆర్  సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్, గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం: సెల్ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ సీఐఈఆర్ గురించి తెలిసేలా పోలీస్ స్టేషన్లో, సర్కిల్ పరిధిలో, డివిజన్ పరిధిలో బ్లూ కోర్ట్స్, పెట్రో కార్ సిబ్బందిచే అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని. సెల్ఫోన్ పోయిన వెంటనే తమ పరిధిలోని పోలీసులకు సమాచారం అందించి సీఈ ఐఆర్ అప్లికేషనన్ను సద్వినియోగం చేసుకోవాలని, ఫోను పెద్దదైన చిన్నదైనా అందులో ఉన్న డాటా చాలా ముఖ్యమని ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్జక్షన్స్  ప్రతి ఒక్కరు కూడా సెల్ఫోన్ ద్వారానే చేయడం జరుగుతుందన్నారు. ఫోన్ ఎక్కడ పడిపోయినా  వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ లో సీఈఐఆర్ పోర్టల్ లో డాటా ఎంట్రీ చేసుకోవాలని కమిషనర్  ప్రజలకు సూచించారు.
పోయిన ఫోను మళ్లీ దొరకదు అనుకున్న ఫోను, పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి ఫోన్ రికవరీ చేసి అందించినందుకు సంబంధిత బాధితులు పోలీస్  కమిషనర్  పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో  ఐటీ సెల్ ఎస్ఐ నరేందర్ రెడ్డి, ఐటీ కోర్ సిబ్బంది స్వప్న, శ్రీకాంత్, రమేష్, మల్లేశం, స్వామి తదితరులు పాల్గొన్నారు.