తాము గెలిస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఎన్నికల ముందు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి ఆరు మాసాలైన పథకాలు అమలుకు నోచుకోవడం లేదని స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఆంజనేయులుగౌడ్ అన్నారు.
తాము గెలిస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఎన్నికల ముందు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి ఆరు మాసాలైన పథకాలు అమలుకు నోచుకోవడం లేదని స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఆంజనేయులుగౌడ్ అన్నారు. గురువారం కేటీదొడ్డి, నందిన్నె, కొండాపురం తదితర గ్రామాలతో పాటు, ధరూరులో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు రైతుబంధు రాక ఇబ్బందులు పడుతు న్నారని, మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఆర్థిక సహాయం ఎక్కడని ప్రశ్నించారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిని ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే పార్టీని, కార్యకర్తలను నట్టేట ముంచి కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆరోపించారు.
తమ పనుల కోసం, పదవులను కాపాడటం కోసం పార్టీలు మారేవారిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయ కుడు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, గట్టు మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు బాసు హనుమంతునాయుడు తదితరులున్నారు. ధరూరులో సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు హన్మంతునాయుడు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.