ఎంపీ సంతోష్‌తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్
హైదరాబాద్‌లో సినీనటులు అమితాబ్ బచ్చన్, నాగార్జున గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్‌కు అమితాబ్, ఎన్టీఆర్ హాజరయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న సంతోష్ కుమార్ వారి వద్దకు వెళ్లి వారితో మొక్కలు నాటించి ఫొటోలు తీసుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో అమితాబ్ ఓ మొక్కను నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి అమితాబ్‌కు సంతోష్ కుమార్ వివరించారు. మంచి కార్యక్రమం చేపట్టారని సంతోష్‌ను అమితాబ్ ప్రశంసించారు ఈ కార్యక్రమంలో నిర్మాత అశ్వనీదత్, ఫిల్మ్‌సిటీ ఎండీ విజయేశ్వరి కూడా పాల్గొన్నారు.
కాగా, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని నాగార్జున కోరారు. సంతోష్ కుమార్ ఇప్పటివరకు 16 కోట్ల మొక్కలు నాటించడం ప్రశంసనీయమని చెప్పారు.